హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జనం అవస్థలు చూడలేక ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడో చూడండి..!

జనం అవస్థలు చూడలేక ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడో చూడండి..!

X
రోడ్డుపై

రోడ్డుపై గుంతలు పూడుస్తున్న ఆంజనేయులు

పోలీస్ ఉద్యోగం అంటే శాంతి భద్రతలు కాపడటం, ట్రాఫిక్ డ్యూటీ వేస్తే వాహనాల రాకపోకలను నియతించడం.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేయడం. కానీ ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం వాహనదారుల కష్టాలు చూసి దానికి పరిష్కారం చూపాడు. ఫైన్ వేయడమే కాదు.. రోడ్డు మీద వెళ్లేవాళ్లు బాగుండాలని కోరుకున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

పోలీస్ ఉద్యోగం అంటే శాంతి భద్రతలు కాపడటం, ట్రాఫిక్ డ్యూటీ వేస్తే వాహనాల రాకపోకలను నియతించడం.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేయడం. కానీ ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం వాహనదారుల కష్టాలు చూసి దానికి పరిష్కారం చూపాడు. ఫైన్ వేయడమే కాదు.. రోడ్డు మీద వెళ్లేవాళ్లు బాగుండాలని కోరుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.., అనంతపురం (Anantapuram) నగరంలోని ఏఎస్ ఐపోలీస్ రామాంజనేయులు పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఉండేవారు. విధులలో భాగంగా కళ్యాణ్ దుర్గం, రుద్రంపేట బైపాస్ సర్కిల్లో విధులను నిర్వహిస్తూ, అక్కడ రోడ్డుపై పడిన గుంతలను మట్టితో పూడ్చారు. అనంతపురంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా రోడ్లు గుంతల పడి ఉన్నాయి.వాటిని కనీసం అధికారులు పూడ్చాలని ఆలోచన కూడా రాకపోవడం చాలా దారుణమైన విషయం.

అనంతపురం పట్టణంలోనే కళ్యాణ్ దుర్గం బైపాస్ నుంచి రుద్రంపేట వెళ్లే దారిలో రవి పెట్రోల్ బంక్ దగ్గర ఎప్పుడు రద్దీగా వాహనాలు తిరుగుతూ, ఎక్కువ ట్రాఫిక్కు ఉంటుంది. అంతేకాక టవర్ క్లాక్ వద్ద బ్రిడ్జి పనులు జరుగుతున్నాడంతో అలా వెళ్లాల్సిన వాహనాలు మొత్తం ఇటుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మామూలుగానే రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ వాహనాలు కూడా వెళ్లడంతో ఎక్కువ రద్దీగా, ట్రాఫిక్ ఎక్కువగా ఉండి ఉండేది.

ఇది చదవండి: అత్యాశే వాళ్లను ముంచింది.. ఎలా బురిడీ కొట్టించాడో చూడండి..!

అయితే అక్కడ ట్రాఫిక్ పోలీస్ వారు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు మార్గంలో విపరీతమైన గుంతలు ఉన్నాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించి, మట్టి తీసుకుని వెళ్లే ట్రాక్టర్ల నుంచి కొంత మట్టిని సేకరించి, మరియు ఆ గుంతలను తానే స్వయంగా పూడ్చారు.

అయితే ఈ సంఘటన అటుగా వెళ్లే వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. నిజానికి ట్రాఫిక్ పోలీస్ తన విధులను సక్రమంగా నిర్వహిస్తూ, వాహనదారుల ఇబ్బందులను కూడా గమనించి, వారికి కొంత సహాయం చేయాలని ఆలోచించి ఇలా రోడ్డుపై పడిన గుంతలను పూడ్చడంతో ఈ పోలీసుని అందరూ అభినందిస్తున్నారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News, Traffic police

ఉత్తమ కథలు