హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapur: ఈ కాలంలో ఈ చిట్కాలతో వాటికి చెక్..!

Anantapur: ఈ కాలంలో ఈ చిట్కాలతో వాటికి చెక్..!

ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్య చిట్కాలు

Health Tips: అసలే మండూస్ ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు వైరల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

G.Venkatesh, News 18, Ananthapur

అసలే మండూస్ ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు వైరల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జ్వరం,దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు తీవ్ర ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి... చెక్ పెట్టేయచ్చు. మరి ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించి చూడండి చక్కని ఫలితం ఉంటుంది.

కఫం అనేది ఊపిరితిత్తుల ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఒక రకమైన శ్లేష్మం. సాధారణంగా జ్వరం, జలుబు ,దగ్గు తర్వాత గొంతు ,ఊపిరితిత్తులలో కఫం ఏర్పడుతుంది. ఇది ఈ ప్రాంతాలను ఎండిపోకుండా కాపాడుతుంది బాక్టీరియా ,వైరస్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అయితే, అధిక కఫం కూడా ప్రమాదమే. కాబట్టి మీకు కఫం ఉంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.

అల్లం..

అల్లం సహజమైన డీకాంగెస్టెంట్ ,యాంటిహిస్టామైన్‌గా ఉపయోగించవచ్చు. అల్లంలో యాంటీ వైరల్ ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కఫం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అల్లం టీని రోజుకు రెండుసార్లు తాగడం మంచిది.

మిరప..

కారం అధిక దగ్గు ,కఫం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం కఫాన్ని కరిగించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి..

వెల్లుల్లిని సహజమైన ఎక్స్‌పెక్టరెంట్‌గా ఉపయోగించవచ్చు, ఇది కఫాన్ని కరిగించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. మీ ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు కఫం తొలగిపోతుంది.

వేడినీరు తాగటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. గొంతు నొప్పికి మరియు జలుబు నుంచి త్వరగా కోలుకోవడానికి వేడినీరు చాలా ఉపయోగపడుతుంది.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Health Tips, Local News

ఉత్తమ కథలు