G Venkatesh, News18, Anantapuram
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాయలసీమ ప్రాంతం ఎన్నో ప్రాచీన కట్టడాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా రాయలవారి హయాంలో నిర్మించిన ఆద్భుత నిర్మాణాలు, ఆలయాలు ఇప్పటికీ చెక్కుచెదర్లేదు. అనంతపురం జిల్లా (Anantapuram District) బుక్కరాయసముద్రం మండలంలో గల శ్రీ కొండమీద రాయుడు స్వామి దేవస్థానం ఎంతో చరిత్ర మరియు విశిష్టత కలదు. ఈ దేవాలయం ఎత్తైన కొండపైన వెలసింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ దేవస్థానం నిర్మించబడిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కొండ పైన వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉద్భవమూర్తిగా ప్రసిద్ధి కార్గేయ మహర్షి ఈ కొండపై తపస్సు చేసే సమయంలో వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఉద్భవించారని. చరిత్ర ద్వారా తెలుస్తోంది.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను అనుసరించి ముఖ ద్వారం గర్భగుడి నిర్మించబడింది. అతి ఎత్తైన కొండపైకి సులువుగా చేరుకోవడానికి రహదారిని కూడా నిర్మించారు. ఈ దేవస్థానం వద్ద నిత్యం పెళ్లిళ్లు మరియు ఇతర శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. కొండపైన వెలిసిన ఉద్భవమూర్తి శ్రీ కొండమీద రాయుడు స్వామివారి గర్భగుడిలో స్వామి వెనుక వైపున ఒక కోనేరు కలదని ఆ కోనేరులో ఐదు తలల పాము స్వామివారికి రక్షణగా ఉంటుందని ఇక్కడ అర్చకులు తెలిపారు.
అయితే ఈ కొలను లో వజ్ర వైడుర్యాలు ఇతర విలువైన సంపద దాగి ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. మరియు ఈ గర్భగుడి స్వామి వారి విగ్రహం వెనుక వైపున కోనేరు మీదుగా ఈ కొండపై నుంచి గుత్తి కోటకు రహస్య మార్గం కలగని మరియు పెనుగొండ కోటకు కూడా ఇంకో రహస్య మార్గం ఉందని ఇక్కడ అర్చకులు తెలిపారు రాజుల కాలంలో ఈ రహస్య మార్గాలను ఉపయోగించేవారని తెలిపారు.
ఈ స్వామివారికి నిత్యం ప్రతిరోజు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి శనివారం ప్రత్యేకమైన అలంకరణతో స్వామివారికి అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం భవనాలు మరియు త్రాగునీటి సౌకర్యాలు దేవస్థానం వారు కల్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News