G Venkatesh, News18, Anantapuram
ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేందుకు ప్రభుత్వాలు పార్కులు ఏర్పాటు చేస్తుంటాయి. ఉదయం లేదా సాయంత్రం ఆ పార్కులకు వెళ్తే రిఫ్రెష్ అవుతాయి. సాధారణంగా పార్కులంటే ఒకటి నుంచి ఐదెకరాల్లో ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 150 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేశారు. అనంతపురం (Anantapuram) నగర శివారులో ఎన్ హెచ్ 44 సమీపంలో గల నేషనల్ పార్క్ చాలా ఆహ్లాదకరంగా పచ్చదనంతో నిండి ఉంది. అనంతపురం నగరంలోని అతిపెద్ద పార్కు ఈ నేషనల్ పార్క్. ఇది సుమారుగా 150 ఎకరాలలో విస్తరించి ఉంది. పార్కు లోపల పెద్ద చెట్లు పచ్చటి వాతావరణం మరియు బోటింగ్ సదుపాయం కూడా ఉంది.
చిన్నపిల్లలకు వివిధ రకాలైన ఆటలు ఆడుకునేందుకువస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గుర్రపు స్వారీ చేయవచ్చు. ఒంటె మీద కూడా వెళ్ళవచ్చు. చిన్న పిల్లలకు ఆడుకోవడానికి చిన్నపాటి సైకిళ్లు మరియు ఉయ్యాలలు,జారు బండ, అంతేగాక పెద్దలకు ఎక్సైజ్ చేసుకోవడానికి వివిధ రకాలైన ఎక్కువ పరికరాలు కలవు. చిన్నపిల్లలకు, పెద్దలకు మంచి ఆహ్లాదాన్నిచ్చే శిల్పారామం కూడా ఉంది. దీనిలో జాయింట్ వీల్ హెలికాప్టర్, బైక్ సరదాగా గడపడానికి వివిధ రకాలైన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈ పచ్చదనం మధ్య ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వీడియోలు కూడా తీసుకునే వాతావరణాన్ని ఇక్కడ కల్పించారు.
ప్రతి ఆదివారం ఇక్కడ వందల సంఖ్యలో పర్యటకులు వస్తూ ఉంటారు చిన్న పిల్లలకు ఇక్కడ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ పార్కు మధ్యలో పల్లెటూరు హస్తకళలకు సంబంధించి ఒక మ్యూజియంలో కూడా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో కుమ్మరి పని, చేనేత పని, కంసుల పని, బొమ్మల తయారీ ఇలా అనేక రకాలైన హస్తకలను ప్రతిబింబించేలా ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
పర్యటకులకు భోజన సదుపాయాల కోసం ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకు ఆడుకోవడానికి బైక్ కూడా అందుబాటులో ఉంది దీనికి ఒక రౌండ్ కి 30 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు మరియు కుటుంబంతో సరదాగా గడపడానికి చాలా బాగుంటుంది ఈ నేషనల్ పార్క్. వీకెండ్స్, సెలవు రోజుల్లోనే కాకుండా ప్రతి రోజు సాయంత్రం జనాలతో నిండిపోయింటుంది ఈ పార్కు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News