G Venkatesh, News18, Anantapuram
అనంతపురం (Anantapuram) ప్రధాన నగరం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గుత్తి మండలం ఉంటుంది. అక్కడి నుండిపది కిలోమీటర్ల దూరంలో బసినేపల్లి తండా వస్తుంది. ఈ గ్రామంలో మనందరికీ తెలిసిన సింగర్ మంగ్లీ (Singer Mangli) జన్మించింది. ఈమె ఇక్కడే తన మొత్తం విద్యాభ్యాసం చేసింది. ఈ బసినేపల్లి తండాలో హనుమంతుని విగ్రహం చాలా ఆకర్షణీయంగా అందంగా సుందరంగా నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంతకుమునుపు దేవస్థానం లేదని విగ్రహం మాత్రమే ఉండేదని గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ విగ్రహానికి దాదాపుగా 80 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. తమ పూర్వీకుల కాలం నుంచిఈ విగ్రహానికి పూజలు చేసేవారని గ్రామస్తులు తెలిపారు. అయితే ఇంతకు మునుపు ఆ విగ్రహానికి చుట్టుపక్కల గ్రామంలో ప్రజలు పూజలు చేసే వారని తెలిపారు.
ఈ గ్రామంలో జన్మించిన మంగ్లీ తన సింగర్ గా స్థిరపడిన తర్వాత మూడు సంవత్సరాల క్రితం దేవస్థానాన్ని నిర్మించిందని గ్రామస్తులు తెలిపారు. దేవస్థానంలో ఉన్న గర్భగుడి చాలా అద్భుతంగా ఉంది. అయితే దేవస్థానం నిర్మించక ముందుగ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఊర్ల గ్రామ ప్రజలు ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి పూజలు చేసేవారని తెలిపారు. మంగ్లీ దేవస్థానం నిర్మించిన తర్వాత దేవస్థాన ఉత్సవం ఘనంగా జరిగిందని.. చుట్టుపక్కల నుంచి చాలా మంది భక్తులు వచ్చారని తెలిపారు. గుడి చుట్టుపక్కల చెట్లు మరియు పంట పొలాల మధ్య గుడి చాలా సుందరంగా ఉంటుంది మరియు గర్భగుడి విషయానికి వస్తే మొత్తం గర్భగుడిని రాతితో నిర్మించడం జరిగింది.
అతి సుందరంగా ఆంజనేయస్వామి ప్రతిమ చెక్కబడి ఉన్నాయి. ఇవి చూడటానికి చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటాయి ఈ గర్భగుడికి నాలుగు వైపులా కూడా అంజనేయ స్వామి ప్రతిమలను చెక్కబడి ఉంటాయి. మంగ్లీ తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు దేవస్థానాన్ని దర్శించి పూజలు జరిపి వెళ్తుందని కూడా ఈ గ్రామ ప్రజలు తెలిపారు.
ఈ దేవస్థానంలోని ఆంజనేయ స్వామికి ప్రతి రోజూ పూజలు జరుపుతామని వాటికోసం పూజారిని నియమించామని అతను ప్రతి రోజూ పూజలు జరుపుతారని గ్రామస్తులు తెలిపారు. దేవస్థానంనిర్మించినప్పటి నుంచి ప్రతి ఏడాదిశ్రీరామనవమి ఉత్సవాలను జరుపుతామని చుట్టుపక్కల గ్రామస్తులు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News