హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఈ కోటలో ఎన్నో రహస్యాలు.. ప్రతి ఒక్కటీ అద్భుతమే..

ఈ కోటలో ఎన్నో రహస్యాలు.. ప్రతి ఒక్కటీ అద్భుతమే..

X
పెనుగండ

పెనుగండ కోటలో రహస్యాలెన్నో

రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే విజయనగర రాజులకు ప్రతేకమైన స్థానం కలదు. అలాంటి చరిత్ర కలిగిన విజయనగర రాజులు హంపి రాజధాని చేసుకొని సుపరిపాలన అందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

G Venkatesh, News18, Anantapuram

రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే విజయనగర రాజులకు ప్రతేకమైన స్థానం కలదు. అలాంటి చరిత్ర కలిగిన విజయనగర రాజులు హంపి రాజధాని చేసుకొని సుపరిపాలన అందించారు. అయితే హంపి మొదటి రాజధానిగా ఉన్న తరుణంలోనే రెండవ రాజధానిగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండ పట్టణంలో చేసుకుని అత్యున్నత పరిపాలనను చేశారు. విజయనగర వంశంలో నాలుగో తరమైన తులువ వంశస్థులు ఇక్కడి నుంచి పరిపాలన చేశారు. పెనుగొండ పట్టణంలో రాజులు పరిపాలించే కాలంలో వజ్ర వైడుర్యాలు, బంగారు రాశులుగా పోసి అమ్మేవారిని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అలాంటి రాజులు పరిపాలించిన ఈ నేలపై పెనుగొండ కోట చుట్టూ అద్భుతమైన దుర్భేధ్యమైన శత్రువులు కూడా తాకలేని విధంగా కోటను నిర్మించారు. అత్యంత ఎత్తైన కొండపై రాజు భవంతి మరియు ఇతర సౌకర్యాలు కూడా ఉండేలా కొండపై నిర్మించారు.

కొండపైన ఉన్న సైన్యానికి ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం బావిని తవ్వించారు మరియు వారి సౌకర్యం చెరువును కూడా కొండపైనే తవ్వించారు. రాజుల కాలంలో నిర్మించిన కట్టడాలపై అద్భుతమైన బొమ్మలు కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం కొండపైకి వెళ్లడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విస్తీర్ణత కలిగిన రోడ్డుని కూడా నిర్మించింది.

ఇది చదవండి: పాములా ఉంటుంది కానీ.. పాము కాదు.. మరి ఏంటో చూసేయండి..!

16వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట విజయనగర సామ్రాజ్యానికి ప్రత్యేకగా నిలుస్తోంది రాయలవారి వైభవం వారి పరిపాలన సాక్ష్యంగా ఎన్నో చారిత్రకమైన కట్టడాలు ఇక్కడ నిర్మించారు. వాటిలో గగన్ మహల్ ఒకటి. అంతేకాక ఇక్కడ తిమ్మరసం బందీ ఖానా కలదు. ఈ బందీ ఖానాలో విజయనగర సామ్రాజ్యంలోని మంత్రి అయిన తిమ్మరసును బంధించి రెండు కళ్ళు తీసివేసి శిక్షించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కానీ కొండపైన కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థలో చేరుకున్నాయి. వాటిని ప్రభుత్వం చొరవ తీసుకొని సాక్షాలను రాబోవు తరాలకు అందించే చర్యలు చేపడితే బాగుంటుందని ఇక్కడి ప్రజలు తెలుపుతున్నారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, History, Local News

ఉత్తమ కథలు