హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ananthapur: ఏటీఏంలో నగదు దొంగతనానికి వచ్చి...వాటర్ బాటిల్స్ చోరీ చేశారు..!

Ananthapur: ఏటీఏంలో నగదు దొంగతనానికి వచ్చి...వాటర్ బాటిల్స్ చోరీ చేశారు..!

వాటర్ బాటిళ్ల చోరీ

వాటర్ బాటిళ్ల చోరీ

Andhra Pradesh: శ్రీ సత్య సాయి జిల్లాలోని సోమందేపల్లి మండలంలో ఇండియన్ వన్ ఏటీఎం సెంటర్ వద్ద దొంగలు దొంగతనానికి విఫల ప్రయత్నం చేశారు. సోమందేపల్లి కేంద్రంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద గల ఇండియన్ వన్ ఏటిఎం సెంటర్ వద్ద దొంగలు డబ్బు దోచుకు వెళ్లడానికి శుక్రవారం ప్రయత్నం చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(G.Venkatesh, News 18, Ananthapur)

శ్రీ సత్య సాయి జిల్లాలోని సోమందేపల్లి మండలంలో ఇండియన్ వన్ ఏటీఎం సెంటర్ వద్ద దొంగలు దొంగతనానికి విఫల ప్రయత్నం చేశారు. సోమందేపల్లి కేంద్రంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద గల ఇండియన్ వన్ ఏటిఎం సెంటర్ వద్ద దొంగలు డబ్బు దోచుకు వెళ్లడానికి శుక్రవారం ప్రయత్నం చేశారు. ఏటీఎం వెనుకవైపున షట్టర్ను తొలగించి దొంగతనానికి పాల్పడ్డారు.అయితే వెనుకవైపు ఉన్న షట్టర్ పూర్తిగా తొలగిపోవడంతో వారు చేసిన ప్రయత్నం విఫలమైంది.

అయితే ఎంత ప్రయత్నించినా సెంటర్ పూర్తిగా రాకపోవడంతో దొంగలు... ఎవరైనా వచ్చి చూస్తారేమో అన్న భయంతో వెళ్లపోయారు. దొంగతనానికి వచ్చాము కదా ఏదో ఒకటి దొంగతనం చేయకపోతే ఎలా అనే ఆలోచించారో ఏమో, ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏదో ఒకటి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నారు. డబ్బు దొంగతనానికి వచ్చిన దొంగలు ఏటీఎం షెల్టర్ తెరు;చుకోకపోవడంతో వారి ప్రయత్నం వృథాఅయింది. కానీ అంతటితో వారి ప్రయత్నం ఆపకుండా ఏదో ఒకటి తీసుకెళ్లాలని ఉద్దేశంతో పక్కనే ఉన్న దుకాణంలో వాటర్ బాటిల్స్ ను దొంగతనం చేసి వెళ్లిపోయారు.

డబ్బు కోసం వచ్చిన వారికి వాటర్ బాటిల్స్ తో సరిపెట్టుకున్నారు. మరి వాటర్ బాటిల్స్ తీసుకెళ్లి వారు దానితో సంతృప్తి చెంది ఉంటారేమో. ఉదయం ఏటీఏంసెంటర్ వద్ద వెనుకవైపు సెంటర్ ఓపెన్ చేసి ఉండడం గమనించిన వారు ఇక్కడ దొంగలు దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారని గమనించి, పోలీసు వారికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఏఎస్ఐ మురళి వచ్చి అక్కడ జరిగిన సంఘటనను పరిశీలించి సెంటర్ ఎంతవరకు ఓపెన్ చేశారు, ఇతర వివరాలను సేకరించి, సీసీ కెమెరాలు పరిశీలించి దొంగతనానికి పాల్పడిన వారి వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు