హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఇక్కడ తక్కువ ధరకే గోల్డ్.. అక్కడే ఉంది అసలు తిరకాసు

ఇక్కడ తక్కువ ధరకే గోల్డ్.. అక్కడే ఉంది అసలు తిరకాసు

తక్కువ ధరకే బంగారం

తక్కువ ధరకే బంగారం

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో బంగారు నాణెలు ఇస్తామని చెప్పి మోసం చేసిన దొంగల ముఠా. బంగారంఅంటే మహిళలకు చాలా ఇష్టం. రోజు రోజుకీ బంగారు ధర పెరిగిపోతున్నప్పటికీ బంగారు కొంటూనే ఉన్నారు మహిళలు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(G.Venkatesh, News 18, Ananthapur)

అనంతపురం జిల్లాలో బంగారు నాణెలు ఇస్తామని చెప్పి మోసం చేసిన దొంగల ముఠా. బంగారంఅంటే మహిళలకు చాలా ఇష్టం. రోజు రోజుకీ బంగారు ధర పెరిగిపోతున్నప్పటికీ బంగారు కొంటూనే ఉన్నారు మహిళలు. అయితే తక్కువ డబ్బులకే బంగారు వస్తుందంటే ఇంకా ఆలోచిస్తారా ఇలా తక్కువ డబ్బులకే బంగారు నాణెలు ఇస్తామని చెప్పి ఒక దొంగల ముఠా మహిళను మోసం చేసింది.

అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద బంగారు నాణెలు అని చెప్పి నకిలీ నాణేలను ఇచ్చి రెండు లక్షల రూపాయలు మోసం చేసిపారిపోయారు. హైదరాబాదుకు చెందిన దీపికకు తిరుపతికి చెందిన ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. 20 రోజుల క్రితం దీపికకు ఫోన్ చేసి నా వద్ద బంగారు నాణెలు ఉన్నాయని తక్కువ ధరకే లభిస్తాయని తెలిపాడు.

కర్ణాటకకు చెందిన హోస్పేటకు వెళ్లి రెండు బంగారు నాణెలను కొనుగోలు చేసి అవి నకిలీవా ఒరిజినల్ అని పరీక్షించింది దీపిక.ళ్లిం అవి ఒరిజినల్ అని నిర్ధారించుకున్న తర్వాత తీసుకువెది. అదే వ్యక్తి మూడు రోజుల క్రితం ఫోన్ చేసి తన వద్ద ఇంకా 200 బంగారు నాణెలు ఉన్నాయని తెలిపాడు. వీటిని రెండు లక్షల రూపాయలకే విక్రయిస్తారని నమ్మబలికాడు.

వీటిని తీసుకోవడానికి అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా వద్దకు వచ్చింది దీపిక. 200 నాణెములు తీసుకొని ఇద్దరు వ్యక్తులు ఆమెకు అందించి రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు. అవి నిజమైన నాణెలనిపరీక్షిస్తున్న దీపిక.. వాటిని గమనించిన ముఠా వెంటనే పోలీసులు వస్తున్నారని చెప్పి కేకలు వేసి అక్కడి నుంచి పారిపోయారు. 200 నాణెములలో రెండు నాణేలు మాత్రమే నిజమైనవని మిగిలినవి నకిలీ అని తెలిసింది. మోసపోయానని తెలిసిన దీపిక పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు