(G.Venkatesh, News 18, Ananthapur)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సంక్రాంతి సంబాలు (Sankranti Celebrations) అంబారాలు అంటుతూనే ఉన్నాయి. మూడో రోజు కనుమ (Kanuma) సందర్భంగా నాన్ వెజ్ లవర్స్ (Non Veg Lovers) పండుగ చేసుకున్నారు. అదే సమయంలో కోడి పందాలు (Cock Fight) జోరుగా సాగుతున్నాయి. వాటితో పాటు జల్లికట్టు, జూదం లాంటి ఆటలు కూడా కొనసాగుతున్నాయి. చాలా జిల్లాల్లో ఆంక్షలు.. నిబంధనలు ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టేశారు. పోలీసులు చూసి చూడనట్టు వదిలేయడంతో.. కోడి పందాలు కాయ్ రాజా కాయ్ అంటూ సాగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సందడి కొనసాగుతుండగా..? ఇక్కడ మాత్రం పోలీసులు ఉక్కుపాదం మోపారు.
ముందునుంచే పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొందరు పట్టించుకోవడం లేదు. పోలీసుల హెచ్చరికలను పక్కన పెడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో పేకాట, కోడిపందాల్లో నిమగ్నమయ్యారు కొందరు. దీంతో రొద్దం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైటి రెడ్డి పల్లి గ్రామం కోడిపందాలు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కోడి పందాలు ఆడుతూ సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ కోడిపందాలు ఆడేవారు పెద్ద మొత్తంలో బెట్టింగు పెట్టి ఆడుతూ ఉంటారు. కోడి పందాల కోసం కోడి పుంజులకు కొంతకాలం నుంచే మంచి మంచి ఆహారం అందించి, వాటిని బలంగా తయారు చేసి సంక్రాంతి పండుగ రోజు కోడిపందాలకు సిద్ధం చేస్తారు. వాటి ధర కూడా వేలలోనే ఉంటుంది.
కోడి పందాలు ఆడడానికి పలు ఇతర గ్రామాల నుంచి వచ్చి ఒకచోట కోడి పందాలు ఆడుతుంటారు. పందాలు కూడా ఎక్కువగానే వేస్తూ ఉంటారు. అయితే కోడిపందాలు ఆడకూడదని, జూదంలాంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు పండగ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. కాదని కోడిపందాలు ఆడిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా కోడిపందాలు జోరుగా సాగడంతో శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పెనుగొండ డీఎస్పీఉత్తర్వుల మేరకు పెనుగొండ సీఐ పర్యవేక్షణలో రోద్దం మండలం ఎస్సై నాగ స్వామి, సిబ్బంది కలిసి రుద్దం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇతర గ్రామాలలో సోదాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: పవన్ కు రెండు అప్షన్లు.. ఆ పని చేయాలి లేదా మా పార్టీలో చేరాలి..?
ఆంక్షలను భేఖాతారు చేస్తూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు ఆడుతున్న కొంతమందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వైటి రెడ్డి పల్లి గ్రామం వద్ద పదిమందిని పోలీసులు పట్టుకున్నారు. కోడిపందాలు ఆడుతూ దొరికిన వారి దగ్గర నుంచి 28,500 రూపాయలు, ఐదు పందెం కోడి పుంజులు, 12 కత్తులు, ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Cock fight, Local News, Makar Sankranti