(G.Venkatesh, News 18, Ananthapur)
అనంతపురం జిల్లా నార్పల మండలంలో జగనన్న ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అయితే వారు ఆ స్థలంలో కొద్ది మంది పునాదులు వేశారు. ఆ తర్వాత అధికారులు తమకు వేరే చోట స్థలాలు మంజూరు చేస్తారని అంటున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన నార్పల క్రాసింగ్ లేవుట్ లో సుమారు 312 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వ ఇల్లు మంజూరు కావడానికి ఆలస్యం అవుతుందని ఈ ప్రాంతంలో లబ్ధిదారుల పట్టాలు మార్చి వేరొక ప్రాంతంలో పట్టాలు ఇస్తారన్నవదంతులు వ్యాపించడంతో ఆందోళన చెందిన పలువురు లబ్ధిదారులు.... తమకు కేటాయించిన పట్టాలు తీసుకొని వారి వారి స్థలాల్లో అప్పులు చేసి పలువురు పునాదులు సైతం వేసుకున్నారు.
అయితే అనుమతి లేకుండా పునాదులు ఎలా వేస్తారని వేసిన పునాదులను సైతం వేసుకున్నారు. ఇప్పుడు వాటిని తీసివేయాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని అనుమతి లేకుండా ఎటువంటి నిర్మాణాలు జరపరాదని అలా నిర్మాణాలు జరిపితే వాటిని తొలగించడం జరుగుతుందని అధికారులు అంటున్నారని వాపోతున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించడం లేదు అన్నచందంగా తమ పరిస్థితి మారిందని లబ్ధిదారులు అంటున్నారు.
అర్హులైన లబ్ధిదారులందరికీ మండల వ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి అనుమతి రాగానే లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకునే విధంగా అనుమతి ఇవ్వడం జరుగుతుందని చాలామంది వారికి ఇచ్చిన స్థలం కంటే ఎక్కువ స్థలంలో సరైన కొలతలు లేకుండా పునాదులు వేసుకొని నిర్మాణాలు చేపడుతున్నారని దీంతో పట్టాలు పొందిన ఇతర లబ్ధిదారులు నష్టపోతారన్న ఉద్దేశంతోనే లబ్ధిదారులు సొంతంగా చేసుకొన్న నిర్మాణాన్ని నిలిపివేయడం జరిగిందని అధికారులు అంటున్నారు.
నార్పల మేజర్ పంచాయతీలో నూట ఇరవై నాలుగు పప్పురు పంచాయతీలో 5, బండ్లపల్లి పంచాయతీలో 23, బొందలవాడ పంచాయతీలో 17, దుగుమర్రి పంచాయతీలో 5, గూగుడు పంచాయతీలో 81, శోధన పల్లి పంచాయతీలో 1, నడిమి దొడ్డి పంచాయతీలో 20, సిద్ధిరాచర్ల పంచాయతీలో 19, గంగనపల్లి, నాయన పల్లి పంచాయతీలో 34, ఇల్లు మంజూరైనట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News