G. Venkatesh, News 18, Ananthapur
అనంతపురం నగరంలోని పార్కులపరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆ పార్కులనిర్వహణ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పార్కును ఏర్పాటు చేయడంతోనే వారి బాధ్యత తీరిపోయిందనిఅనుకుంటున్నారు అధికారులు.వాటి నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. వాటి వల్ల ఎంతో ఉపయోగం ఉందో ఒక్కసారి కూడా ఆలోచించటం లేదు. చిన్న పిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు అక్కడికి వచ్చి వాడి ఆహ్లాదాన్ని ఆస్వాదించే వారు వ్యాయాయం చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినవాటి నిర్వహణ లోపం వల్ల అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి.
కొన్ని పార్కులో ఆహ్లాదం కోసం మరికొన్ని పార్కును వ్యాయామం కోసం ఏర్పాటు చేసి వదిలేస్తున్నారు. కానీ వాటి నిర్వహణ చేయడం లేదు. ప్రభుత్వం పార్కు నిర్మాణానికి లక్షల్లో ఖర్చు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. అక్కడ ప్రజల డబ్బు వృధాగా అవుతుంది. ఎటువంటి ఉపయోగం లేకుండా పార్కులు శిథిలావస్థ చేరుకున్నాయి. సరైన వ్యాయామం చేయకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. దానికి అనుగుణంగా పార్కులలో వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. అధికారులు2012 వ సంవత్సరంలో అప్పటి ఎంపీసంగమేశ్వర నగర్ మరియు సాయి నగర్ నగరవాసులకు అనుకూలంగా నేతాజీ పార్క్ ను ప్రారంభించారు.
అయితే ప్రారంభించిన కొంతకాలానికే నిరుపయోగంగా పడి ఉంది. ఇప్పుడు వాటిలో ఏది కూడా ఉపయోగకరంగా లేదు. ఇంతకు ముందు ఫ్యామిలీతో కలిసివెళ్లి వ్యాయామం చేసే వాళ్ళు కానీ.. ఇప్పుడు ఎవరు కూడా ఇటు వైపు కూడా రావడం లేదు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే యువకులు, యువతులు మార్నింగ్ మరియు ఈవెనిం,గ్ నైట్ 10:00 వరకు ఇక్కడ చదువుకునే వారు. కానీ ఇప్పుడు వారికి అనుకూలంగా ఇక్కడ లైట్ సిస్టం కూడా లేదు. ఇతర సౌకర్యాలు లేకపోవడంతో వారు కూడా ఇటువైపు రావడం లేదని ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు.
ఈ నేతాజీ పార్క్లో ప్రహరీ గోడ చాలా వరకూ కూలిపోయింది. దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. అలాగే చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా అలాగే ఉండిపోయాయి. వ్యాయామ పరికరాలు కూడా మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి. కానీ ఎవరూ కూడా పట్టించుకోకపోవటంతో...పిచ్చి మొక్కలు చెట్టుకొమ్మలు ఈ స్థలంలో పడి ఉన్నాయని చాలా అసౌకర్యంగా ఉందని వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులనుస్థానికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News