Home /News /andhra-pradesh /

ANANTAPURAM THAT IS THE NANDAMURI BALAKRISHNA HE GOES HIS FAN HOUSE AND GAVE SURPRISE VISIT IN HINUPURAM NGS TPT

Balayya: బాలయ్య అంటే ఇది.. అభిమాని ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్.. ఏం చేశారో చూడండి..

అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య

అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య

Balayya: నందమూరి నట సింహం బాలయ్య అంటే ఇది అని మరోసారి నిరూపించారు.. అతడు పార్టీ కార్యకర్త కాదు.. అలా అని అభిమాన సంఘం నేత కాదు.. అయినా అతడి ఇంటికి వెళ్లి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు.. ఎందుకో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Hindupur, India
  balakrishna surprised his fan: హీరో నందమూరి బాలకృష్ణ (Nandmuri Balakrishna) లో రెండు కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే స్థాయిలో ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు. మరోసారి తన అభిమానాన్ని బాలయ్య చాటుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా (Ananatpuram District) లోని తన సొంత నియోజకవర్గం హిందూపూర్ (Hindupr) లో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడి బాల‌య్య స‌తీస‌మేతంగా వెళ్లారు. తన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని సంకల్పించారు. అందుకే అందిరికీ ఉచితంగా వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉండేలా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం (NTR Arogya Ratham) పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఈ ఆరోగ్య రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. తాము ప్రారంభించిన మొబైల్ వాహనం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తామని వెల్ల‌డించారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు, ఉచిత వైద్యం అందించనుంద‌ని తెలిపారు. వాహనంలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక ఫార్మాసిస్ట్, ఆరుగురు వైద్య సిబ్బంది, ఒక మెడిసిన్ కౌంటర్, కంప్యూటర్ ఆపరేటర్‌లు ఉంటారు. సాధారణ వ్యాధులకు చికిత్స, ఉచితంగా మందులు ఇస్తారు.

  బాలయ్య హిందూపురం వచ్చిన రీజన్ వేరైనా.. అభిమానుల పట్ల తన ప్రేమ ఎలా ఉంటుందో మారోసారి బాలయ్య చాటుకున్నారు. హిందూపురం పర్యటనలో ఉన్న ఆయన.. ఓ అభిమాని ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చారు.. అలాగని ఆ అభిమాని టీడీపీ నేతో.. యాక్టివ్ కార్యకర్తో కాదు.. కనీసం బాలయ్య ఫ్యాన్ అసోసియేషన్ నేత కూడా కాదు.. ఓ సాధారణ అభిమాని.. అయినా అతడికి ఇంటికి వెళ్లారు బాలయ్య.. ఎందుకో తెలుసా..?  హిందూపురం పర్యటనలో ఉన్న బాలయ్యకు.. ఇవాళ తన అభిమాని పుట్టిన రోజు అని తెలిసింది.. వెంటనే తన స్థాయి.. హోదా అన్ని పక్కన పెట్టి.. తన అభిమాని ఇంటికి వెళ్లారు. అతడికి తన ఆశీస్సులు అందించారు. బాలయ్య స్వయంగా రావడంతో.. తనకు ఇదే అసలు పుట్టిన రోజు అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు అభిమాని.. వెంటనే సాలువా కప్పి.. తన అభిమాన హీరోను సత్కరించాడు.

  ఇదీ చదవండి : పవన్ మాల గురించి ఎప్పుడైనా విన్నారా..? ఎర్ర కండువాతో 49 రోజుల దీక్ష.. ఏం చేస్తారంటే..?

  ఇలా బాలయ్య తన అభిమానులపై ప్రేమ చూపించడం ఇదే తొలిసారి కాదు. ఆ మధ్య కర్నూలులో గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించి బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరించిన సమయంలో మరో అభిమానికి షాక్ ఇచ్చారు. గతంలో ఓ అభిమానికి బాలయ్య మాట ఇచ్చారు. ఈసారి కర్నూలులో వస్తే తప్పకుండా కలుస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం.. అభిమానికి స్వయంగా తానే ఫోన్ చేశారు. అతడి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. అభిమాని కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడారు.

  ఇదీ చదవండి : భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆన్ లైన్ టికెట్లు విడుదల.. స్వామి వాచీలు వేలం..? ఎలా పొందాలంటే..?

  బాలయ్య తన ప్రేమ చూపించిన ఎన్నో ఘటనలు ఉన్నాయి. అయితే ఆయన అభిమానులు ఎంత ప్రేమిస్తారో.. అదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోతుంటారు.. ఎవరైనా తనకు నచ్చని పని చేసినా.. తనను చిరాకు పెట్టినా.. పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా చెంప చెల్లుమనిపిస్తారు. దీంతో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఆ వీడియోలు ట్రోల్ అవుతు ఉంటాయి. అయితే బాలయ్య మంచి మనసు గురించి తెలిసిన అభిమానులు మాత్రం అలాంటి చెప్ప దెబ్బలను కూడా పట్టించుకోకుండా జై బాలయ్య అంటూ ఉంటారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Hindupuram, Nandamuri balakrishna

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు