(G.Venkatesh, News 18, Ananthapur)
అనంతపురం జిల్లా మీదుగా NH 54 డి హైవే వెళుతుంది. వీటిలో భాగంగానేే సింగనమల మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా ఈ హైవే వెళుతుంది. ఈ జాతీయ రహదారికి సంబంధించిరోడ్డు విస్తరణ అధికారులు చేపడుతున్నారు. కొద్దిమంది భూమి ఈ రోడ్డు పనుల్లో భాగంగా పోతుంది. భూ సేకరణ సేకరించిన అధికారులు... వారికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. నష్టపరిహారం చెల్లించే జాబితాలో తమపేరు లేదని బాధితురాలు ఓబులమ్మ వాపోతున్నారు.
బాధితురాలిది అనంతపురం జిల్లా, సింగనమల మండలం, బండమీద పల్లి గ్రామం. ఈమెకు చక్రాయిని పేట వద్ద సర్వేనెంబర్ 560-1,560-3లో 3.25 ఎకరాల భూమి కలదు.ఈ హైవే ఈ పొలం గుండా వెళుతుంది.నష్టపరిహారం కింద డబ్బు చెల్లించాలని అధికారులను కోరారు. అధికారులు నష్టపరిహారం జాబితాలో తమపేరు లేదని చెప్తున్నారని కన్నీరు మున్నీరు అవుతున్నారు.
కుమారుడు మృతి చెందడంతో కోడలు, తన ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారని చెబుతున్నారు. తాముఈ పొలం మీదనే ఆధారపడి జీవిస్తున్నామని, రోడ్డు విస్తరణలో పొలంలో కొంత భాగం వెళితే తమకు జీవనాధారం ఉండదని అంటున్నారు. సరిపడానష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందేమోనని అధికారులు జాబితాలో పేరు లేదని తెలుపుతున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం జాబితాలో పేరు ఎందుకు లేదో తెలుసుకుందామనిఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లిన వారు సరిగా స్పందించడం లేదని వాపోతున్నారు.ఎమ్మార్వో ఆఫీస్ చూట్టూ కాళ్లు అరిగేలే తిరిగిన ఫలితం లేదని.. స్పందనలో పలుమార్లుఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని ఆవేదన చెందుతున్నారు. దిక్కులేని తమకు న్యాయం చేయాలని... ఈ విషయంపైఅధికారులు స్పందించి నష్టం పరిహారం అందించాలని బాధితురాలి కుటుంబం కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News