Home /News /andhra-pradesh /

ANANTAPURAM TELUGU DESAM CHIEF CHANDRABABU NAIDU SERIOUS ON ANANTAPURAM DISTRICT LEADERS NGS

Chandrababu Naidu: నేను మారాను.. మీరు మరరా? చెప్పిందేంటి.. చేస్తున్నందేంటి.. ఆ నేతలకు చంద్రబాబు క్లాస్

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu Naidu: ఒకప్పుడు కంచుకోట లాంటి నియోజకవర్గాలు కూడా.. ఇప్పుడు గెలుపుపై నమ్మకం కలగడం లేదు. దీంతో ఆ జిల్లా పార్టీ నేతలపై చంద్రబాబు పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యారు.. తాను మారారని.. మరి మీరు మారరా అని ప్రశ్నించారు. కాలు బయటపెట్టడానికి ఏంటి సమస్య అని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మళ్లీ అధికారం చేజిక్కుంచుకోవడమే టార్గెట్ గా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శ్రమిస్తున్నారు. వయసు మీద పడుతున్నా.. యువతకు పోటీగా విరామం లేకుండా జిల్లాల బాట పడుతున్నారు. ఇబు బాదుడే బాదుడు అంటూ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. వరద ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా భేటీ నిర్వహిస్తున్నారు. నిత్యం కార్యకర్తలకు టచ్ లో ఉంటున్నారు. వారి నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. మరోవైపు టికెట్ల కేటాయింపు విషయంలోనూ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో జ్యూమ్ మీటింగ్ (Zoom Meeting) లు అంటే గంటల తరబడి మాట్లాడే ఆయన.. ఇప్పుడు సూటిగా.. సుత్తి లేకుండా విషయం కుండబద్దలు కొడుతున్నారంట.. ఇలా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అయితే పూర్తిగా మారినట్టు కనిపిస్తున్నారు. కానీ కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల తీరుపై విమర్శలు రావడంతో.. మీరు మారరా అంటూ మండిపడ్డారు. అసలు కాలు కదిపి ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. మీకు ఏం చెప్పాను.. మీరేం చేస్తున్నారు.. జనంలోకి వెళ్లమంటే వెళ్లరు.. బాదుడే బాదుడు అనమంటే.. ఈ ఊసే లేదు.. పార్టీ సభ్యత్వ నమోదు చేయండంటే దాని గురించి ఆలోచించరు.. ప్రభుత్వ వైఫల్యాలు ఇన్ని ఉంటే.. మీరు మాత్రం కాలు బయట పెట్టడం లేదు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తోంది.

  అన్ని నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు తనకు తెలసని.. ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవల్ నుంచి ఫీడ్ బ్యాక్ ఉంది అని చెప్పారు. ఇక మీరు మారాల్సిన టైం వచ్చిందంటూ గట్టిగానే డోస్ ఇచ్చారు. ఇంతకీ అనంతపురం జిల్లా నేతలకు బాబు ఎందుకంత సీరియస్ క్లాస్ పీకారో తెలుసా? తాను మారుతాను అని చెప్పినట్టే మారినట్టు కనిపిస్తున్నారు. ఆయన మైండ్ సెట్ బాగా మారిపోయింది. గతంలో కార్యకర్తలు, నాయకులతో ఏ మీటింగ్ జరిగినా.. గంటల తరబడి ఆయన స్పీచ్ ఇచ్చే వారు. ఇది విన లేక.. ఎప్పుడూ చెప్పేదే కదా అనుకునే నేతలే ఎక్కువగా ఉండే వారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మారారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది.. ఏ నేత ఏం చేస్తున్నారో.. ఏనేత పై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం ఏంటన్నది ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.  ఈనేపథ్యంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎప్పటిలానే బాస్ బాగా పని చేయండి.. ప్రభుత్వ వైఫల్యాల గురించిచెబుతారని ఈ మీటింగ్ ను లైట్ గా తీసుకుని హాజరయ్యారు. మీటింగ్ స్టార్ట్ కాగానే.. ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది చంద్రబాబు ఫుల్ క్లారిటీతో క్లాస్ ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడటం ప్రారంభించిన రెండు నిమిషాలకే నేతలకు అర్థమైంది.. ఈ సారి క్లాస్ గట్టిగానే ఉంటుందని క్లారిటీకి వచ్చారు. ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచేస్తే మీరేం చేస్తున్నారు? బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి ఇళ్లు టచ్ చేయాలని చెప్పానుగా.. ఎంత మంది ఇప్పుడు వరకు ఎన్ని రోజులు ఈ ప్రోగ్రామ్ చేశారు చెప్పండంటూ ఫైర్ అయ్యారు.

  ఇదీ చదవండి : ఈ ఎమ్మెల్యేను గుర్తు పట్టారా..? అధికార పార్టీ నేత అయినా.. వ్యవసాయంతో బిజీ బిజీ

  చాలా మంది నేతలు మొదట రెండు మూడు రోజులు చేయడం, ఆ తరువాత ఎప్పుడో తమకు కుదిరినప్పుడు జనంలోకి వెళ్లడం లేదా.. పార్టీ పిలుపునిచ్చినప్పుడు కనిపించడం ఆ తరువాత ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా పోతున్నారని క్లాస్ పీకారు. ఇది కేవలం ఒకరిద్దరు కాదు జిల్లా నేతలందరి పరిస్థితి ఇలానే ఉంది. మీరు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎప్పుడు జనంలోకి వెళ్లారు.. ఎంత సేపు అక్కడుంటున్నారు.. అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారనే విషయాలపై తనకు పూర్తి స్థాయి క్లారిటీ ఉందని గట్టిగానే చెప్పారు. దీంతో ఆ నేతలంతా ఒక్కసారి సైలెంట్ అయ్యారు.

  ఇదీ చదవండి : క్యాన్సర్, షుగర్, గుండెజబ్బులు అన్నిటికీ అదే మందు.. సీ వీడ్ మొక్కతో ఇన్ని ప్రయోజనాలా..?

  ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో ఉండాలని చెబితే.. ఒక నియోజకవర్గంలో కూడా మెరుగ్గా ప్రోగ్రెస్ లేదని ఫైర్ అయ్యారు. వ్యవసాయానికి మీ ప్రాంతంలో విద్యుత్ మీటర్లు అమర్చుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకల్ గా ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాలపై రెగ్యూలర్ గా కార్యక్రమం చేయడంపై ఏ ఒక్కరికీ శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేతలు మానిటర్ చేయాల్సిన ఐదు జిల్లాల కో-ఆర్డీనేటర్ అమర్నాథ్ రెడ్డిని మీరు జిల్లాలకు వెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించాలి కదా అని చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం.
  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు