Home /News /andhra-pradesh /

ANANTAPURAM TELUGU DESAM CHANDRABABU NAIDU FOCUS ON RAYALASEEMA AREA ON NEXT ELECTIONS NGS

Chandrababu Naidu: సీఎం జగన్ కోటలో చంద్రబాబు నాయుడు స్కెచ్.. ప్లాన్ ఏంటంటే..?

ఆ నాలుగు జిల్లాలపై చంద్రబాబు ఫోకస్

ఆ నాలుగు జిల్లాలపై చంద్రబాబు ఫోకస్

Chandrababu Naidu: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోట కుప్పంపై సీఎ జగన్ ఫోకస్ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు.. వైసీపీ అధినేత కోటలో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇంతకీ ఆయన టార్గెట్ ఏంటి..? ఏం చేస్తున్నారు..

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇటు వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అడ్డా కుప్పం నియోజకవర్గం నుంచే తన ఆపరేషన్ మొదలెట్టారు. ఆయన ప్రత్యర్థికి బంపర్ ఆఫర్ కూడా కురిపించారు. ఇదే సమయంలో చంద్రబాబు సైతం.. వైసీపీ కోటలో పాగా వేసే ప్రయత్నాలు మొదలెట్టారు.. ప్రస్తుతం రాయలసీమ
  అంటే వైఎస్సార్సీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత రెండు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే సీమలో టీడీపీకి పెద్దగా బలం లేదనే చెప్పాలి.. ఇప్పుడేనే కాదు గతంలోనూ అదే పరిస్థితి.. మొదట్లో కాంగ్రెస్ బలంగా ఉండగా, ఇప్పుడు వైసీపీని సీమ ప్రజలు ఆదరిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే పైచేయి. గత ఎన్నికల్లో అయితే మరీ వార్ వన్ సైడ్ అయ్యింది. సీమలో మొత్తం 52 సీట్లు ఉంటే…వైసీపీ 49 సీట్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో ఒకటి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కాగా.. రెండోది నందమూరి బాలయ్య నియోజకర్గం హిందూపూరం.. మూడోది ఉరవకొండ.. ఈ మూడు మినిహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా రెప రెపలాడింది. కర్నూలు, కడపను క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరులో 14కి 13, అనంతపురంలో 14 సీట్లకు 12 సీట్లు గెలుచుకుంది.

  ఈ సారి కూడా సీమ మొత్తం క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. సీమలో మళ్లీ వార్ వన్ సైడ్ అయితే..
  చంద్రబాబు ఆశలు అడియాశలు అయినట్టే.. ఇప్పటికే జగన్ దూకుడు పెంచారు.  చంద్రబాబు కంచుకోటను కూలగొట్టాలని డిసైడ్ అయ్యారు. కుప్పం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ భేటీలో చంద్రబాబు ప్రత్యర్థికి బంపర్ ఆఫర్ ప్రకటించారు.. మీరు భరత్ ను గెలిపించండి.. కుప్పానికి నేను మంత్రి పదవి కానుకగా ఇస్తాను అంటూ ఓపెన్ గా చెప్పేశారు.

  Bumper offer to Chandrababu Naidu opponent || CM Jagan promise|| చంద్రబా... https://t.co/2loApNXrKk via @YouTube #JaganannaThodu #jaganFailedCM #JaganPaniAyipoyindhi #YSRCP #YSRCPSOCIALMEDIA #ysrcppleanary #YSRCPcheapPolitics #TdP22 #TDP2022 #TDPTwitter #TDP

  మరోవైపు గత వైభవం రావాలన్నా.. అధికారం తిరిగి పొందాలన్న సీమలో ఎక్కువ సీట్లు గెలవడం తప్పని సరి అని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకే చంద్రబాబు ఈ సారి సీమపై గట్టిగానే ఫోకస్ చేశారు…ఇక్కడ కొన్ని సీట్లు అయిన గెలుచుకుంటే…అధికారంలోకి రాగలమని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుని, సీమలో ఒక 30 శాతం నుంచి 40 శాతం సీట్లు గెలుచుకుంటే అధికారంలోకి రావోచ్చు అనేది బాబు ప్లాన్.  ఇదే క్రమంలో సీమలో కొన్ని సీట్లపై బాబు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఎలాగో అనంత అంటే టీడీపీకి కంచుకోట ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బాబు చూస్తున్నారు. కనీసం ఇక్కడ 9-10 సీట్లు గెలుచుకోవాలని బాబు…అక్కడ
  నేతలకు గైడెన్స్ ఇస్తున్నారట.

  ఇదీ చదవండి : ఎమ్మెల్యేను భయపెడుతున్న సెంటిమెంట్? అక్కడ ఎవరికైనా ఒక్క ఛాన్స్ మాత్రమేనా?

  ఇక తన సొంత జిల్లా చిత్తూరు విషయానికొస్తే.. ఇక్కడ కనీసం ఆరు సీట్లకు పైగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అటు జగన్ సొంత జిల్లా కడపలో కనీసం 2 సీట్లు, కర్నూలులో 4 నుంచి 5 సీట్లు గెలుచుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చు అనేది బాబు
  అభిప్రాయం.

  ఇదీ చదవండి : మిస్ సౌత్ ఇండియాగా అంధ్రా అమ్మాయి.. ఛరిష్మా కృష్ణ బ్యాక్ గ్రౌండ్ ఇదే

  ఓవరాల్ గా 20 నుంచి 25 సీట్లను తమ ఖాతాలో వేసుకుంటే అధికారం ఖాయమన్నది చంద్రబాబు లెక్క.. అందుకే సీనియర్ నేతలను ఎంపిక చేసి.. వారికి ఈ జిల్లాల బాధ్యతను అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేతలను టీడీపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొందరు కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు