హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balayya New Role: టీడీపీలో బాలయ్యకు కొత్త బాధ్యతలు.. టర్కీ నుంచి రాగానే నిర్ణయం.. కారణం అదేనా..?

Balayya New Role: టీడీపీలో బాలయ్యకు కొత్త బాధ్యతలు.. టర్కీ నుంచి రాగానే నిర్ణయం.. కారణం అదేనా..?

 బాలయ్య పై పోటీ చేసేది ఎవరంటే..?

బాలయ్య పై పోటీ చేసేది ఎవరంటే..?

Balayya New Role: నందమూరి బాల‌కృష్ణ‌ ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఆయనకు పదవులు లేవు.. సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగారు. కానీ ఇప్పుడు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారా..? సడెన్ గా ఈ నిర్ణయానికి కారణం ఏంటి.. బాలయ్యకు ఎలాంటి బాధ్యతలు అప్పగించనున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Balayya New Role: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం.. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి రానున్న ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌ంగా మారాయి. ఎట్టి ప‌రిస్థితుల్లోను అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు నాయడు (Chandrababu Naidu) చాలా కసితో ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్టే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. గతంలో చంద్రబాబుకు.. ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరకు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎందుకంటే గ‌తంలో నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌డానికి చివ‌రి రోజు వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసేవారుకాదు. ఆఖరి నిమిషంలో అభ్యర్థులను మార్చేవారు.  ఈ నాన్చుడు ధోర‌ణి భారీగా నష్టం కలిగించిందనే అభిప్రాయం ఉంది. గత అనుభవాలతో ఈసారి త‌న‌ను తాను మార్చుకుంటున్నట్టు కనిపిస్తున్నారు.


  గతంలోలా మొహమాటాన్ని పక్కన పెట్టి.. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా కొంత‌మంది ఇన్‌ఛార్జిల‌కు ముందుగానే చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో చాలావ‌ర‌కు స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని, అసంతృప్తులెవ‌రైనా ఉంటే ముందే తెలిసిపోతుంద‌ని, త‌ద్వారా పార్టీని మ‌రింత ప‌టిష్ట‌ప‌రుచుకోవ‌చ్చ‌నే టాక్ వినిపిస్తోంది.  ఇదే సమయంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసుకుంటే.. రాయలసీమలో తెలుగు దేశం కంటే.. వైసీపీ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమలో వైసీపీని ఓడించగలిగితే సగం విజయం సాధించినట్టే.. కానీ అది అంతసులువు కాదు. దానికి ప్రత్యేక వ్యూహాలు అవసరం. ఇందులో భాగంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డం ఒక ఎత్త‌యితే.. ప్ర‌చారం మ‌రో ఎత్తు. అందుకే ఈసారి చంద్ర‌బాబు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు.


  ఇదీ చదవండి : ఛీఛీ గుడిలో ఈ వెధవ పని ఏంటి..? వారి తీరుపై మండిపడుతున్న భక్తులు.. అసలేం జరిగిందో చూడండి


  సీమలో ఉన్న నాలుగు ఉమ్మ‌డి జిల్లాల్లో ప్ర‌స్తుతం వైసీపీ హ‌వా కొన‌సాగుతోంది. కానీ ప్రజ‌ల్లో వ్య‌తిరేక‌త కూడా ఇక్క‌డే ఎక్కువ‌గా వ్య‌క్త‌మ‌వుతోంద‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు త‌రుచుగా ఇక్క‌డే ప‌ర్య‌టిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఆయ‌న ప్ర‌చారానికి భారీగా స్పంద‌న వ‌స్తోంది. ఎన్నికల కంటే ముందుగానే రాయ‌ల‌సీమలో క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ‌ను రంగంలోకి దింపితే మంచి ఫలితాలు ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే అభిమానుల సంఖ్య అక్కడ ఎక్కువ‌. ఈ ప్రాంతం నేప‌థ్యంలో ఆయ‌న ఎక్కువ సినిమాలు చేయ‌డంవ‌ల్ల ఇక్క‌డివారంతా బాల‌య్య‌ను త‌మ సొంత వ్య‌క్తిగా భావిస్తారు. దీంతో రాయల‌సీమ ప్ర‌చార బాధ్య‌త‌లు బాల‌కృష్ణ‌కు అప్పగించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు పార్టీ కేంద్ర కార్యాల‌య వ‌ర్గాలు వెల్ల‌డించాయి.


  ఇదీ చదవండి : ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కుమ్ములాటలు.. బహిరంగంగానే బాహాబాహీ


  రాష్ట్రం మొత్తంమీద బాల‌కృష్ణ‌ను ప్ర‌చారం చేయించ‌డంక‌న్నా పూర్తిగా రాయ‌ల‌సీమ‌మీదే దృష్టి కేంద్రీక‌రించేలా చేయాల‌నేది బాబు ప్రణాళికగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ రాయ‌ల‌సీమ‌లోనే ఉన్నాయి. వాటిలో అత్య‌ధిక స్థానాల‌ను కైవ‌సం చేసుకోగ‌లిగితే రాష్ట్రంలో అధికారాన్ని చేజ‌క్కించుకోవ‌డం సుల‌భ‌మ‌నేది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బాలయ్య టర్కీలో సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన అక్కడ నుంచి వచ్చిన తరువాత దీనపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Hindupuram, Nandamuri balakrishna, TDP

  ఉత్తమ కథలు