G Venkatesh, News18, Anantapuram
అనంతపురం జిల్లా (Anantapuram District) అనగానే జేసీ ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కడున్నా ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఈ ఫ్యామిలీలో జేసీప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) కొద్ది కాలంగా తాడిపత్రి డీఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి డీఎస్పీ చైతన్య పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు అధికారంలో ఉన్న ఈ ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రత్యర్థులపై తీవ్రమైన ఆరోపణ చేసుకోవడం, సొంత పార్టీ వారు తప్పు చేసిన బహిరంగంగా వారిని ఖండించడం ఈ ఫ్యామిలీ నైజం.
ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే వస్తూ ఉంది ట్రావెల్స్ అయినా, ఇతర వ్యాపారమైన ఏదో ఒక విషయంలో జెసి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అదే కొంత కాలంగా డిఎస్పి తాడిపత్రి డిఎస్పి చైతన్యపై వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు జేసి ప్రభాకర్ రెడ్డి.
డిఎస్పి చైతన్య కావాలనే తమపనికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఈ తరహాలోనే డీఎస్పి చైతన్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “నన్ను ఎన్కౌంటర్ చేస్తావా... నీ బతుకు ఎంత చైతన్య నా విషయంలో పర్సనల్ గా వెళ్తున్నారు. మేము తిరగబడితే తట్టుకోలేవు, ఆయనది మనిషి పుట్టుక కాదు, ఏ జాతికి చెందినవారు తెలియదు” అంటూ తీవ్రమైన వ్యాఖ్యాలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. డిrఎస్పి చైతన్యపై జేసీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొంతకాలంగా డీఎస్పీచైతన్యపై మాట్లాడినప్పుడల్లా తీవ్రమైన వ్యాఖ్యాలు చేస్తూనే వస్తున్నారు.
ప్రస్తుతం జేసీ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో వైరల్ గా మారాయి. దీనిపై డీఎస్పీ చైతన్య ఎలా స్పందిస్తారు..? లైట్ తీసుకుంటారా..? లేక పోలీస్ మార్క్ రియాక్షన్ ఏమైనా ఉంటుందా అనేది జిల్లాలో చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Jc prabhakar reddy, Local News