Home /News /andhra-pradesh /

ANANTAPURAM STAR DIRECTOR PRASANT NEEL RELATION WITH EX MINSTER RAGHUVEERA REDDY HE DONATE 50 LAKH RS FOR HOSPITAL NGS

Prashanth Neel: ఏపీ మాజీ మంత్రికి కేజీఎఫ్ డైరెక్టర్ ఏమవుతాడో తెలుసా? ప్రశాంత్ నీల్ అసలు పేరేంటంటే?

ప్రశాంత్ నీల్ (ఫైల్)

ప్రశాంత్ నీల్ (ఫైల్)

Prashanth Neel: ప్రస్తుతం క్రేజీ గుర్తింపు తెచ్చుకున్నవారిలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కరు. బ్లాక్ బస్టర్ సినిమాలతో రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. పెద్ద మనసు కూడా ఉందని నిరూపించుకున్నాడు. ఏపీ నిర్మిస్తున్న భారీ విరాళం ఇచ్చారు. దీనిపై మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకీ రఘువీరా రెడ్డితో నీల్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India
    Prashanth Neel: ప్రస్తుతం భారత దేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల ఫోకస్ తనవైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. కేజీఎఫ్ (KGF) సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా రికార్డుస్థాయి కలెక్షన్లతో టాక్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీగా మారారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు ఆయన కోసం క్యూలో ఉన్నారు. ప్రభాస్ (Prabhas) తో సలార్ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు ప్రశాంత్ నీల్ .. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. పెద్ద మనసు చాటుకున్నాడు. తన తండ్రి 75వ జయంతిని పురస్కరించుకుని ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు నీల్. తన తండ్రి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని సత్యసాయి జిల్లా (Satyasai District) మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి (Raghu Veera Reddy) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరి ప్రశాంత్‌ నీల్‌కి రఘువీరారెడ్డికి సంబంధమేంటనుకుంటున్నారా?

    క్రేజీ గుర్తింపు తెచ్చుకున్నఈ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ మరెవరో కాదు.. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడు సుభాష్‌ రెడ్డి కుమారుడే.. ప్రశాంత్ నీల్ పుట్టి పెరిగింది బెంగుళూరులోనే అయినా.. అతని స్వగ్రామం అనంతపురం జిల్లా నీలకంఠాపురం. ఆయన సొంతూరు ఎప్పుడూ వచ్చినా అక్కడ ఉండే గుడిలోకి వెళ్లి పూజలు చేసుకుంటూ.. సందడి చేస్తారు.

    అక్కడ తనకు బంధువులు కూడా ఉన్నారు.  ఆగస్టు 15న సుభాష్ రెడ్డి జయంతి కావడంతో సోమవారం మరోసారి నీలకంఠాపురంలో పర్యటించారు. తండ్రి 75వ జయంతిని పురస్కరించుకుని నీలకంఠాపురంలోఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రశాంత్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ వీడియోలు.. ఫోటీలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

    ప్రశాంత్ నీల్  అసలు పేరు కూడా ప్రశాంత్‌ నీలకంఠాపురం. దానిని ప్రశాంత్‌ నీల్‌గా మార్చుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురం చనిపోయారు. నీలకంఠాపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అందుకే తరచూ ఇక్కడికి వస్తున్నాడీ స్టార్‌ డైరెక్టర్‌. కేజీఎఫ్‌ 2 విడుదల రోజు కూడా స్వగ్రామానికి వచ్చి తండ్రి సమాధిని దర్శించుకున్నారు నీల్‌.



    స్టార్‌ డైరెక్టర్ విశాల హృదయాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్న ప్రశాంత్ ఎన్టీఆర్‌, చెర్రీలతోనూ సినిమాలు చేయడానికి కమిట్‌ అయ్యాడు. త్వరలోనే ఎన్టీఆర్ సినిమా పట్టాలు ఎక్కేందుకు సిద్ధమైంది కూడా..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Jr ntr, Prabhas, Prashanth Neel

    తదుపరి వార్తలు