హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కలెక్టర్ మనవడికి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం..

కలెక్టర్ మనవడికి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం..

మనవడికి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేసిన కలెక్టర్

మనవడికి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేసిన కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు.మనవడికి వైరల్ ఫీవర్ వస్తే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన మనవడికి వైద్య సేవలు అందించారు శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) కలెక్టర్ పి.బసంత్ కుమార్. కలెక్టర్ అంటే ఉన్నత స్థాయి జీవనం, ఉన్నత స్థాయి వైద్యం చేయించుకోగలరు.కానీ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మాత్రం ఇందుకు మినహాయింపుగా ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో తన మనవడికి వైద్యం చేయించారు. ప్రజలు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు చేయించచుకోవాలని సూచించారు. ఐఏఎస్ స్థాయిలో తమ కుటుంబంలో ఆరోగ్య విషయంలో ఏవైనా ఇబ్బందులు వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారు.

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు.మనవడికి వైరల్ ఫీవర్ వస్తే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా తన మనవడికి వైద్య సేవలు అందించి జిల్లా కలెక్టర్ ఆదర్శంగా నిలిచారుతన మనవడు కిరీటి విరాజ్ (వయసు 3 ఏళ్ళు), మూడు రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడేవాడని..ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య చికిత్స అందించాలని నిర్ణయించి, పుట్టపర్తి పట్టణ పరిధిలోని ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తన కుటుంబ సభ్యులతో పాటు చిన్నారిని శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు.

ఇది చదవండి: అందుకే బీట్ రూట్ సాగు బెస్ట్.. లాభాలు ఎలా ఉంటాయంటే..!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిసిహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్,మెడికల్ ఆఫీసర్ నాగరాజు నాయక్ చిన్నారిని పరీక్షించారు.ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తోంది,తదితర వివరాలను ఆరా తీశారు.అర్బన్ ల్యాబ్ టెక్నీషియన్ స్వప్న చిన్నారికి బ్లడ్ టెస్ట్ చేసి,బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్ నిర్ధారించారు.అనంతరం చిన్నారికి వైరల్ ఫీవర్ వచ్చినట్లు నిర్ధారించి జ్వరం తగ్గేందుకు తగిన మందులను అందించారు. మూడు రోజుల్లోగా జ్వరం నుంచి కోలుకునేందుకు అవకాశం ఉందని డిసిహెచ్ఎస్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు