Home /News /andhra-pradesh /

ANANTAPURAM SRI KRISHNA JANMASTAMI SPECIAL FAMOUS RADHA PARTHASARATHI ISKON TEMPLE IN ANANTAPURAM NGS TPT

Krishnashtami 2022: జన్మాష్టమి రోజు కచ్చితంగా వెళ్లాల్సిన ప్రదేశం ఇదే.. శ్రీ రాధా పార్థసారథి విశిష్టత ఏంటంటే?

అనంతపురంలో రాధా పార్థసారథి ఆలయం

అనంతపురంలో రాధా పార్థసారథి ఆలయం

Krishnaastami 2022: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నో చరిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు కచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం ఒకటి ఉంది.. నాలుగు గుర్రాలు లాగుతున్న రథంలా ఉండే ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India
  Krishnaastami 2022: తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు (Sri Krishna Janmastami Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు.. మరోవైపు తల్లిదండ్రులు తమ చిన్నారులను చిన్నికృష్ణుడిగా.. గోపికలుగా అలంకరిస్తూ.. సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆలయాలు సైతం హరే కృష్ణ (Hari Krishna) నామ స్మరణతో మారమోగుతున్నాయి. ఇతర ఆలయాల సంగతి ఎలా ఉన్నా.. ఇస్కాన్ ఆలయాల్లో (Iskon Temples) ఈ రోజు ఎక్కువ సందడి కనిపిస్తుంది. అలాంటి ఆలయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ఆలయం మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మంచిదని భక్తుల నమ్మకం.. ఈ రోజు అక్కడ రాధా కృష్ణ స్వామికి పూజలు చేస్తే.. సమస్యలు అన్నీ తీరిపోయి ప్రశాంతంత కలుగుతుందని నముతున్నారు. ఈ ఆలయంలో ఏపీలోని అనంతపూర్ జిల్లా (Ananatpuram District )లోని సోములదొడి గ్రామ శివార్లలో ఉంది. ఫిబ్రవరి 2008లో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోని అన్ని ఇస్కాన్ దేవాలయాల కు ఇది కాస్త భిన్నమైనదే అని చెప్పాలి. ఈ ఆలయాన్ని శ్రీ రాధా పార్థసారథి దేవాలయం (Sri Radha Parthasarthi Temple) అని కూడా అంటారు. ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీ కృష్ణుడు.. స్వామితో పాటు.. రాధా దేవి కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది.

  ముఖ్యంగా ఈ ఆలాయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. రాత్రి సమయంలో దేవాలయం ఉదయం గులాబీ రంగులో మెరుస్తుంది. ఇక రాత్రి అయితే బంగారు రంగు షేడ్ ధగ ధగ మెరుస్తూ దర్శనమిస్తుంది. అంతేకాదు గుడి మొత్తం నాలుగు గుర్రాలు లాగుతున్న రథాన్ని పోలి ఉంటుంది. ఆలయం చుట్టూ ఉద్యానవనం ఉంది.. ఇక్కడకు వెళ్లిన వారికి.. ఓ ప్రశాంత వాతావరణంలోకి వచ్చామని.. కేవలం ఆలయానికి కాదని.. నిజమైన దేవుడి సన్నిధికే వచ్చామనే ఫీలింగ్ కలుగుతుంది.

  ఆలయంలోని శ్రీకృష్ణుడు రాధా దేవి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడకు ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు కృష్ణుడిని పూజించడానికి, ప్రత్యేక భజనలు చేయడానికి వస్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్న ఇస్కాన్ దేవాలయాలలో అత్యుత్తమ నిర్మాణాలలో ఇది ఒకటి. ఆలయంలో వేదాంత పాటశాల, కాన్ఫరెన్స్ హాల్, కీర్తన హాలు, భక్తుడు మరియు పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు రెస్టారెంట్ ఉన్నాయి. ముఖ్యంగా జన్మాష్టమి రోజు పువ్వుల అలంకరణతో మరింత ఆకర్షణీయంగా మారుతుంది ఆలయం. ఇక్కడ ప్రత్యేకంగా జరిగే దహీ హండి ఆచారాలను మరింత ప్రత్యేకంగా ఉంటాయి.  ఈ రాధా పార్థసారథి ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే..?
  ఏ ప్రాంతం నుంచైనా రోడ్డు మార్గమే సులువైనది.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరుల నుంచి అనంతపురం బస్ స్టేషన్ కు అన్ని ప్రధాన నగరాల నుంచి బస్ లు ఉన్నాయి. అలాగే రైల్వే స్టేషన్ సైతం కేవలం 7 కిలోమీటర్ల దూరమే ఉంటుంది కాబట్టి ట్రైన్లో కూడా రావొచ్చు. విమానంలో రావాలి అంటే సమీపంగా పుట్టపర్తి విమానాశ్రయం 81 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూర్ విమానాశ్రయం 172 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతపురం నుంచి నేరుగా ఆలయానికి ఆర్టీసీతో పాటు.. ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.  పూర్తి అడ్రస్: ఇస్కాన్ ఆలయం, శ్రీ రాధా పార్థసారథి టెంపుల్, హరే కృష్ణ ల్యాండ్, నేషనల్ హైవే నెంబర్ 7, సోములద్దోడి, అనంతపూరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
  వెబ్‌సైట్: http://centers.iskcondesiretree.com/anantapur/
  ఇమెయిల్ ఐడి: gopinathdasa@yahoo.com
  ఇస్కాన్ టెంపుల్, అనంతపూర్ సంప్రదింపు

  నంబర్: 08854201234,09985316616
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Hindu Temples, Krishnashtami

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు