హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: జాబ్ లేదని టెన్షన్ పడుతున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్..!

AP News: జాబ్ లేదని టెన్షన్ పడుతున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్..!

X
అనంతపురంలో

అనంతపురంలో యువతకు ఉచిత శిక్షణ

అనంతపురం (Anantapuram) లో గల రూడ్సెట్ సంస్థ జిల్లాలోని గ్రామీణ మహిళలు,పురుషులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు అయినా యువతకు శిక్షణ ఇస్తుంది అనంతపురం నగర శివార్లలోని ఆకుతోటపల్లి గ్రామంలో ఈ సంస్థ ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

అనంతపురం (Anantapuram) లో గల రూడ్సెట్ సంస్థ జిల్లాలోని గ్రామీణ మహిళలు,పురుషులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు అయినా యువతకు శిక్షణ ఇస్తుంది అనంతపురం నగర శివార్లలోని ఆకుతోటపల్లి గ్రామంలో ఈ సంస్థ ఉంది. ఈ సంస్థ అనంతపురం జిల్లా మరియు శ్రీ సత్యసాయి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల వారికి శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థకు కెనరా బ్యాంక్ (Cenara Bank) మరియు ధర్మస్థల దేవాలయం వారి సహకారంతో నిధులు సమకూరుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి శిక్షణ ఇస్తుంది. కుట్టు మిషన్ మరియు డ్రైవింగ్ మరియు మొబైల్లో రిపేరు శిక్షణ మరియు కంప్యూటర్ శిక్షణ మరియు ఇతర రంగాల్లో కూడా శిక్షణ ఇస్తుంది. మహిళలకి బ్యూటీ పార్లర్లో శిక్షణ ఇస్తుంది.

శిక్షణకు వచ్చిన వారికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి ఫీజులు రుసుము చెల్లించకుండా హాస్టల్ సదుపాయం మరియు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు. సంవత్సరంలోనే ప్రతినెలా ఒక్కో రంగానికి సంబంధించి శిక్షణ ఇస్తారు. శిక్షణకు వచ్చిన వారికి ఒక నెల టైం లో శిక్షణ పూర్తి చేసి వారికి స్వయం ఉపాధి కల్పనపై శిక్షణ ఇస్తారు.

ఇది చదవండి: కిక్కు కావాలి అనుకునే వారు తప్పక చూడాల్సిన ప్లేస్.. థ్రిల్ మామూలుగా ఉండదు..

శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఆర్థిక సహాయాన్ని కెనరా బ్యాంకు పిఎంఈజివై స్కీమ్స్ కింద రుణ సదుపాయం కూడా కల్పించేలా ప్రోత్సహిస్తారు. ఈ సంస్థ ఇప్పటికే అనంతపురం జిల్లాలోని మరియు పుట్టపర్తి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపింది.

ఇది చదవండి: డయల్ 100 ఉన్నది ఎందుకు..? స్పందన లేకపోతే ఎలా..?

చాలా మంది మహిళలు ఈ శిక్షణ పొంది స్వయం ఉపాధి కల్పించుకుని షాపులు నిర్వహించి వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా అండగా నిలబడుతున్నారు. ప్రతి సంవత్సరం రూడ్సెట్ సంస్థ వారు వెబ్ సెట్ ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నామని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తారు. ఆసక్తి కలిగినవారు వెబ్ సైట్ను సంప్రదించాల్సిందిగా కూడా తెలిపారు. ఫోటోస్,ఆధార్ కార్డు ముఖ్యంగా ప్రభుత్వం కల్పించినా తెల్ల రేషన్ కార్డుప్రామాణికంగా తీసుకుంటారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ రూడ్సెట్ అందిస్తున్న శిక్షణనుతీసుకొని మరియు వారి కుటుంబాలకు అండగా నిలవాలని రూరల్ సంస్థ డైరెక్టర్ తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు