(G.Venkatesh,News18,Ananthapur)
ఈ రోజుల్లో అసలు మానవత్వం అంటే ఏంటో అంతా మరిచిపోతున్నారు. పక్కవారు ఎలా పోతేం మాకేంటి అన్నట్టు వ్యవహరించేవారే ఎక్కువ.. సాయం అని అడిగితే.. స్వార్ధం చూసుకునే వారు పెరుగుతున్నారు. ఇలాంటి రోజుల్లోనూ కొందరు మాత్రం హెల్పింగ్ హ్యాండ్స్ (Helping Hands) గా నిలుస్తున్నారు. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా (Satya Sai District) లోని పెనుగొండ మండలానికి చెందిన సవితమ్మ (Savitamma) తన తండ్రి రామచంద్రారెడ్డి (Ramachandra Reddy) పేరు మీదుగా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ (SRR Charitable Trust) ఏర్పాటు చేసి ఎంతో మంది పేదవారికి సహాయం చేస్తున్నారు. తన తండ్రి రామచంద్రరెడ్డికూడా పేదవారికి బలహీన వర్గాలకు సేవ చేసేవారు అని, అయను ఎప్పుడు వారికి అండగా నిలబడే వారిని. తన తండ్రి బాటలోనే ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఎంతోమందికి అండగా నిలుస్తున్నామంటున్నారు ఆమె.
ఆర్థిక సహాయం చేస్తూ అనాథపిల్లలకు బట్టలు.. పుస్తకాలు అందిస్తున్నారు. ఇంతకుముందు కూడా పెనుగొండ పట్టణానికి నీటి ఎద్దడి ఉండేది. ఆ సమయంలో ఎస్.ఆర్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాట్రాక్టర్ల ద్వారా ఆమె పట్టణానికి మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. గర్భిణీలు హాస్పిటల్ దగ్గరకు నార్మల్ చెకప్ కోసం వచ్చిన వారికి.. హాస్పిటల్ దగ్గర ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తున్నారు సవితమ్మ.
చుట్టుపక్కల మండలాల్లో ఎవరికి కష్టమొచ్చినా తాను ముందుండి వారికి అండగా నిలబడుతున్నారు సవితమ్మ. అంతేకాక ఎవరైనా కుటుంబంలో పెద్ద దిక్కుని కోల్పోతే వారికి కొంత మొత్తంలో ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రజల జీవితాన్ని మార్చివేసిన, ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన కరోనా కష్టకాలంలో ప్రతి పేదవారికి ఇంటి దగ్గరకు వెళ్లి మాస్కులు, బియ్యం, కందిపప్పు, చక్కెర, ఇతర కూరగాయలు, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుటుంబాలకు అందించారు.
ఇదీ చదవండి : ప్రభుత్వం తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అంతేకాక పరిశుద్ధ కార్మికులను కరోనా కష్ట కాలంలో వారికి అండగా కూడా నిలబడ్డారు.నిత్యావసర సరుకులు కూడా వారికి అందించారు. కరోనా కాలంలో పారిశుద్ధ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా కూడా నిలబడ్డారు. ఎవరైనా పేదవారు కూతురికి పెళ్లి చేయలేని సమయంలో, వారికి అండగా నిలబడి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల మండలంలో పేదవారికి నేనున్నాను అనే భరోసా కల్పిస్తోంది సవితమ్మ.
ఇదీ చదవండి : అనుమానంతో అరెస్ట్ చేశారు.. అసలు విషయం తెలిసి షాకయ్యారు
అందరూ ఆమెను కుటుంబ సభ్యుల్లో భాగంగా భావించి సవితమ్మ అక్క అని పిలుస్తూ ఉంటారు. సవితమ్మ మాట్లాడుతూ తమతండ్రి ఆశయాలకు తగ్గట్టుగా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందనినా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తమ తండ్రి ఆశాలను ముందుకు తీసుకెళ్తానని ఆమె తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Local News