హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP: టీడీపీకి కొత్త తలనొప్పి.. మాజీ ఎమ్మెల్యేపై జేసీ వర్గం సీరియస్.. బహిష్కరించాలంటూ తీర్మానం

TDP: టీడీపీకి కొత్త తలనొప్పి.. మాజీ ఎమ్మెల్యేపై జేసీ వర్గం సీరియస్.. బహిష్కరించాలంటూ తీర్మానం

టీడీపీ పార్టీ గుర్తు

టీడీపీ పార్టీ గుర్తు

Anantapur: ప్రభాకర్ చౌదరిని పార్టీ నుంచి బహిష్కరించాలని జేసీ వర్గం తీర్మానం చేయడంతో.. ఇందుకు కౌంటర్‌గా ప్రభాకర్ చౌదరి వర్గం ఏం చేస్తుంది ? ఈ రెండు వర్గాల మధ్య విభేదాలను తొలగించేందుకు టీడీపీ నాయకత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నది జిల్లా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే.. కొన్ని చోట్ల స్థానికంగా ఉండే నేతల మధ్య విభేదాలు మాత్రం రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ వర్గం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి(Prabhakar Chowdary) మధ్య గొడవలు మరింత ముదిరిపోతున్నాయి. తాజాగా టీడీపీలోని జేసీ వర్గం నేతలు సమావేశమై ప్రభాకర్ చౌదరి వల్ల అనంతపురంలో పార్టీ నాశనమవుతోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్(Paritala Sri Ram) ఓటమి కూడా ప్రభాకర్ చౌదరి కారణమని విమర్శించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే.. పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతుందని వ్యాఖ్యానించారు.

  అనంతపురంలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి వర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాయి. అయితే ఒక్కసారిగా ఎదురుపడటంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇరువర్గాలు ఒకరికొకరు ఎదురుపడటంతో అనంతపురం(Anantapur) అర్బన్ నియోజకవర్గంలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. దాంతో జేసీ, ప్రభాకర్ చౌదరి వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేపట్టాయి. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఇరువర్గాలకు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు.

  అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనుమతి లేకుండా మీరెందుకు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు జేసీ వర్గాన్ని ప్రశ్నించారు. అనంతపురం పార్లమెంటు ఇన్‌చార్జిగా జేసీ తనయుడు పవన్ రెడ్డి ఉన్నందున తాము కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉందని వాదించారు. అనంతపురంలో తమను ఎవరూ ఆపలేరని జేసీ వర్గం స్పష్టం చేసింది. ఇరువర్గాల మధ్య గొడవలు జరక్కుండా పోలీసులు సర్దిచెప్పి పంపేశారు.

  Minster Roja: డేరాబాబా కంటే చంద్రబాబు డేంజర్.. మంత్రి రోజా సంచలన ఆరోపణలు

  Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్ర వాయిదా.. సీఎం జగన్ నిర్ణయమే కారణమా ?

  అనంతపురంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ఏ కార్యక్రమానికైనా పోలీసుల అనుమతి ఉండాలని.. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారిని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ప్రభాకర్ చౌదరిని పార్టీ నుంచి బహిష్కరించాలని జేసీ వర్గం తీర్మానం చేయడంతో.. ఇందుకు కౌంటర్‌గా ప్రభాకర్ చౌదరి వర్గం ఏం చేస్తుంది ? ఈ రెండు వర్గాల మధ్య విభేదాలను తొలగించేందుకు టీడీపీ నాయకత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నది జిల్లా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, JC Diwakar Reddy, TDP

  ఉత్తమ కథలు