(G.Venkatesh, News 18, Ananthapur)
అనంతపురం నగరంలోని పాతూరులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఎంతో మహిమగల అమ్మవారు. ఈమె భక్తుల కోరికలను నెరవేరుస్తుందని ఇక్కడ భక్తులు గట్టిగా నమ్ముతారు. శనివారం అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించారు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారికి పూజలు నిర్వహించారు.
పురాణాల ప్రకారం ఎల్లమ్మ అమ్మవారు పుట్టలో జన్మించారని గిరి మహారాజుకి దొరికిందని అతను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి జమదగ్ని మహా రుషికి ఇచ్చి పెళ్లి చేశారని అయితే తన భర్త చేతిలో అమ్మవారు మరణించి తర్వాత ఆమె మహిమలతో తిరిగి బతికారని ఇలా ఆమె జీవిత చరిత్ర ఇక్కడ దేవస్థానంలో లిఖించారు.
అయితే ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణతో అలంకరించారు నిమ్మకాయల హారము మరియు నాగపడకల గల కిరీటంతో అమ్మవారిని అలంకరించారు. రేణుక ఎల్లమ్మ గారి ముక్కుపుడక ప్రత్యేక అలంకరణగా నిలిచింది దేవస్థానంలో అమ్మవారి విగ్రహం ఎంతో తేజస్సుతో అమ్మవారి స్వయంగా దర్శనమిచ్చేలా అలంకరించారు. నగరంలోని భక్తులు అమ్మవారిని దర్శించుకుని వారి కోరికలను కోరుకున్నారు ఈతకల్లు కార్మికుల ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.
ఈతకల్లు అమ్మవారితో సమానంగా వారు భావిస్తూ ఉంటారు అమ్మవారు ఈతకల్లను ఇష్టపడే వారిని పురాణాల్లో చెబుతూ ఉంటారు. అనంతపురం నగరంలో గల పురాతన దేవస్థానంలో పాతూరులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఒకటని అర్చకులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి పూజలు నిర్వహిస్తామని ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని కలిసిన వారికి అమ్మవారు ఎప్పుడు అండగా ఉంటారని కష్టాలు దరిదాపులకి రాకుండా చూస్తారని కోరిన కోరికలు నెరవేరుస్తుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఈ దేవాలయముకు నగరంలోని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని కోరికలను కోరుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News