G Venkatesh, News18, Anantapuram
అనంతపురం (Anantapuram) నగరం నుంచి కర్ణాటక (Karnataka) కు చౌక బియ్యం తరలింపు కొనసాగుతూనే ఉంది. అధికారులు ఎన్నిసార్లు దాడి చేసి పట్టుకున్నా అక్రమార్కులు వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల నగరంలో చాలా చోట్ల అధికారులు చౌక బియ్యం తరలింపును అడ్డుకున్నారు. అయినా చౌక బియ్యం తరలింపు కొనసాగుతూనే ఉంది, నగరంలోని చౌక బియ్యంను ఆటోల్లో తరలిస్తున్నారు.నగరానకి దగ్గరలో ఉన్న ప్రాంతాల నుంచి కూడా చౌక బియ్యంతరలిస్తున్నారు. ఒక చోట బియ్యంచేర్చిన తర్వాత ప్యాకింగ్ చేసి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తూనే ఉన్నారు. ఇటీవల అనంతపురం నగరంలోని పంగల్ రోడ్డు వద్ద రైస్ మిల్లులో చౌక బియ్యం పట్టుకున్నారు. అయినా చౌక బియ్యం తరలింపు ఆగడం లేదు.
ముఖ్యంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, రొద్దం మండలాలు కర్ణాటకకు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ మండలాల గుండా కర్ణాటకకుచౌక బియ్యం తరలిస్తున్నారు.గత సంవత్సరంలో 17వేల క్వింటాల చౌక బియ్యం లో అధికారులు పట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటికే 500 క్వింటాల చౌక బియ్యంను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. డీలర్లుస్టాక్ ను సరిగా చూపించకపోవడం,
ప్రజల వద్ద తక్కువ ధరకే చౌక బియ్యం కొని ఇతర ప్రాంతాలకు తరలిస్తూనే ఉన్నారు.
కొంతమంది అధికారులు దందా చేసే వారి నుంచి మామూలు వసూలు చేసి చూసి చూడన్నట్టు వదిలేయటంతో ఈ దందా కొనసాగుతూనే ఉంది. రెవెన్యూ, పౌర శాఖ మరియు విజిలెన్స్ వారి సమన్వయంతో అక్రమ చౌక బియ్యం అరికట్టడానికి గట్టి చర్యల చేపడుతున్నామని, వారిపై కేసు నమోదు చేసి, ఫైన్లు వేస్తున్నామని మరికొంతమందిపై క్రిమినల్ కేసులునమోదు చేస్తున్నామని డిఎస్ఓ శోభారాణి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News