Home /News /andhra-pradesh /

ANANTAPURAM POLICE OFFICER HARASSING WOMAN HOME GUARD IN ANANTAPURAM DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Andhra Pradesh: మహిళా హోంగార్డులే వారి టార్గెట్.. ఆ జిల్లాలో పోలీస్ అధికారుల తీరేవేరు..! కన్నేస్తే వదిలిపెట్టరట..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Anantapuram: సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేది ఖాకీలు మాత్రమే. తప్పు చేయాలన్నా పోలీసులకు ఎక్కడ దొరికిపోతామో అని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఖాకిల్లోనూ కీచకులు ఉన్నారని కొన్ని ఘటనలు రువుజు చేస్తున్నాయి. ఏకంగా డిపార్టుమెంట్ లో పనిచేస్తున్న మహిళ హోంగార్డుపై కన్నేసి ఆమెను లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India
  GT Hemanth Kumar, News18, Tirupati

  లాండ్ ఆర్డర్ క్రమంగా ఉండాలన్నా.. మహిళలు స్వేచ్ఛగా తిరగాలన్నా పోలీస్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది. పోలీసులు లేనిదే ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి. సంఘ విద్రోహ శక్తులను అరికట్టి.. సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేది ఖాకీలు మాత్రమే. తప్పు చేయాలన్నా పోలీసులకు ఎక్కడ దొరికిపోతామో అని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఖాకిల్లోనూ కీచకులు ఉన్నారని కొన్ని ఘటనలు రువుజు చేస్తున్నాయి. ఏకంగా డిపార్టుమెంట్ లో పనిచేస్తున్న మహిళ హోంగార్డుపై కన్నేసి ఆమెను లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎస్పీకి పిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District)  పోలీస్ ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు కీచకుల అవతారమెత్తి మహిళా సిబ్బందిని వేధిస్తున్నారు.

  అనంతపురం జిల్లాలో ఓ మహిళ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రిజర్వడ్ విభాగంలో ఉన్నారు. అయితే గంత కొంతకాలంగా తనను రిజర్వ్‌డ్‌ ఇనస్పెక్టర్‌ హరికృష్ణ లైంగికంగా వేధిస్తున్నాడని ఎస్పీకి పిర్యాదు చేశారామె. నా నంబర్ ఇస్తా తీసుకో.. మీ ఇంటికి ఎవరెవరు వస్తారో నాకు తెలుసంటూ అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కొన్నాళ్లపాటు వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న సదరు హోంగార్డు.. హరికృణ ఆగడాలు మితిమిరడంతో హెచ్ఓడీకి ఫిర్యాదు చేశారు.

  ఇది చదవండి: కానిస్టేబుల్ ఆన్ లైన్ లవ్.. యువతిని ట్రాప్ చేసి చీటింగ్.. చివరికి ఇలా దొరికాడు..


  దీంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఐతే ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న బాధితురాలిపై ఒత్తిడి తేవడం మొదలెట్టారు. అయినా వెనక్కు తగ్గని బాధితురాలు ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆర్‌ఐ హరికృష్ణ తనను ఛాంబర్ కు పిలిపించుకొని తనకు ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంటగట్టి.. రోజుకో కారణంతో బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నట్లు ఎస్పీకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

  ఇది చదవండి: బుగ్గ కొరికాడని భర్తపై కేసు పెట్టిన భార్య.. ఇద్దరి మధ్య అంతలా ఏం జరిగిందంటే..!


  ఇంట్లో ఏదైనా సహాయం కావాలంటే తనకు ఫోన చేయాలని నంబర్ ఇచ్చేవారట. ఫోన్ చేయకపోతే ఎందుకు చేయలేదని అడుగుతున్నారని బాధితురాలు వాపోయింది. పర్సనల్‌గా మాట్లాడాలని బయటకు రమ్మని ఎవరూలేని ప్రాంతంలో అసభ్యంగా ప్రవర్తించారని పిర్యాదులో పేర్కొన్నారు. ఐడీ కార్డు మీద సంతకం కోసం వెళ్తే.. నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసుకోవాలి జాగ్రత్త.. నేను అనుకుంటే ఉద్యోగం పోతుంది అని బెదిరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారని సమాచారం.  అనంతపుర జిల్లా పోలీస్ ఏఆర్ వింగ్ లో చాలా మంది అధికారులు కీచకులుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మహిళా సిబ్బందిని వేధించడం లేకుంటే ఇతర మహిళలతో సీక్రెట్ గా వ్యవహారాలు నడిపిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కొంతకాలం క్రితం ఓ మహిళా హోందార్డుపై ఆమె ఇన్ ఛార్జ్ కన్నేశాడు. ఈ విషయం తెలుసుకున్న మరో అధికారి.. తాను కూడా ఆమెపై కన్నేసి వ్యవహారం నడిపించాడు. దీంతో ఆమె విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. అంతేకాదు ఇద్దరు మహిళా హోంగార్డుల్లో ఒకరికి ఆర్ఎస్ఐతో మరొకరికి ఎస్ఐ కేడర్ అధికారులతో ఎఫైర్ ఉండేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విషయం తెలిసిన ఉన్నతాధికారులు వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అందరికీ మంచి చెప్పాల్సిన పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఇలాంటి చీకటి వ్యవహారాలు తమ పరువు తీస్తున్నాయని పలువురు సిబ్బంది, అధికారులు అంటున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP Police, Harassment on women

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు