హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ప్రేమ పేరుతో మాయ చేస్తాడు.. న్యూడ్ ఫోటోలతో బెదిరిస్తాడు.. చివరికి ఇలా చిక్కాడు

ప్రేమ పేరుతో మాయ చేస్తాడు.. న్యూడ్ ఫోటోలతో బెదిరిస్తాడు.. చివరికి ఇలా చిక్కాడు

శ్రీసత్యసాయి జిల్లాలో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడు అరెస్ట్

శ్రీసత్యసాయి జిల్లాలో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడు అరెస్ట్

మహిళల అశ్లీలచిత్రాలలో తీసి డబ్బు డిమాండ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అమ్మాయిలను పరిచయం చేసుకోవడం కొద్ది రోజులు అమ్మాయితో ట్రావెల్ చేయడం... ఆమెకు మరింత దగ్గరై ఫోటోలు, వీడియోలు తీయడం వాటిని న్యూడ్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రబుద్ధుడ్ని కటకటాల్లోకి నెట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

G Venkatesh, News18, Anantapuram

మహిళల అశ్లీలచిత్రాలలో తీసి డబ్బు డిమాండ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అమ్మాయిలను పరిచయం చేసుకోవడం కొద్ది రోజులు అమ్మాయితో ట్రావెల్ చేయడం... ఆమెకు మరింత దగ్గరై ఫోటోలు, వీడియోలు తీయడం వాటిని న్యూడ్ గా మార్చి డబ్బు డిమాండ్ చేయడం ఇలాంటి పనులు చేస్తున్న ఓ వ్యక్తిని శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) బుక్కపట్నం మండలలో అరెస్టు చేసినట్టు బుక్కపట్నం ఎస్సై నరసింహులు తెలిపారు. పుట్టపర్తి మండలానికి చెందిన బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులుకేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన చంద్రమౌళి వివిధ ప్రాంతాలలో ఇలా అమ్మాయిలను మోసం చేశాడని తెలిపారు. ఇతని లక్ష్యం చదువుకున్న అమ్మాయిలే అని తెలిపారు.

ప్రేమ పేరుతో వారికి దగ్గర అవడం వారికి తెలియకుండానే వారి ఫోటోలు తీసి వాటిని అశ్లీలంగా మార్చి వాటితో బెదిరించడం చేస్తున్నారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి మూడు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇతనికి వివాహం అయిందని కొన్నేళ్లుగా ఇదే తరహాలోనే విశాఖపట్నం , హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో ఎంతోమంది అమ్మాయిలకు వలవేసి మోసం చేసినట్టు గుర్తించామన్నారు. అశ్లీలంగా మార్చిన యువతుల చిత్రాలను తల్లిదండ్రులకు పంపించి.. వారి నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇది చదవండి: కొడుక్కి సున్తీ.. కోడలిపై అనుమానం.. మామ ఎంతపనిచేశాడో చూడండి..!

ఇతని కోర్టులో హాజరు పరచామని కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. ఇతను ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో పరిచయం ఏర్పడడం.. తర్వాత వారికి బెదిరింపు కాల్స్ చేయటం వంటివి చేస్తున్నాడని తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ఆడపిల్లలు పరిచయం లేని వ్యక్తులతో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసుకోవడం మంచిది కాదని సమస్యలు ఎదురవుతాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అయితే ఎవరికైనా ఇలా బెదిరింపులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాటికి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వివరించారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News, Nude videos blackmails

ఉత్తమ కథలు