Home /News /andhra-pradesh /

ANANTAPURAM POLICE ARRESTED MOST WANTED CRIMINAL PRASAD NAIDU IN KIDNAP CASE IN ANANTAPURAM DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Most Wanted: అతడిపై 150 కేసులు.. నేరాలపై యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు.. చివరకు ఇలా చిక్కాడు

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

అతడో పేరు మోసిన క్రిమినల్. పదులకొద్ది కేసులు అతడిపై ఉన్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 30కి పైగా మర్డర్ కేసుల్లో నిందితుడు. మర్డర్లు, కిడ్నాపులు చేయడంలో ఎక్స్ పర్ట్. అంతేకాదు తాను చేసిన నేరాల గురించి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన ఘనుడు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  అతడో పేరు మోసిన క్రిమినల్. పదులకొద్ది కేసులు అతడిపై ఉన్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 30కి పైగా మర్డర్ కేసుల్లో నిందితుడు. మర్డర్లు, కిడ్నాపులు చేయడంలో ఎక్స్ పర్ట్. అంతేకాదు తాను చేసిన నేరాల గురించి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన ఘనుడు. ప్రస్తుతం చాలా కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్నాడు. మారాడనుకున్నవాడు మళ్లీ పాత వృత్తిలో అడుగుపెట్టాడు. ఓ సారి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) గుంతకల్లు ప్రాంతం జి.కొట్టాల గ్రామానికి చెందిన వెంటకషేన్ అనే వ్యాపారి ఈనెల 20న కిడ్నాప్ కు గురయ్యాడు. వెంకటేషన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు.. రూ.40 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని లేకుంటే అతడ్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

  ఐతే భయపడిపోయిన వెంకటేష్ కుమారుడు సాయి కిరణ్.. గ్రామస్థుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నిరోజుల క్రితం అదే ప్రాంతంలో కిడ్నాప్ జరిగిన సంగతి తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడి కుమారుడితో కిడ్నాపర్లకు ఫోన్ చేయించి డబ్బులిస్తామని చెప్పించారు. గ్రామంలో ఓ చోట కారు ఏర్పాటు చేసి అందులో డబ్బులు పెట్టినట్లు వారికి చెప్పారు. డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి అక్కడికొచ్చిన కిడ్నాపర్లు పోలీసులను చూసి పారిపోగా.. చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. బాధితుడ్ని మహబూబ్ నగర్ వద్ద కాపాడారు.

  ఇది చదవండి: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి.. ఎనిమిది నెలలు తిరిగే సరికి సీన్ రివర్స్.. పాపం సమంత..


  కిడ్నాపర్ల ముఠాలో జి.కొట్టాలకు చందిన వ్యక్తితో పాటు సుంకర ప్రసాద్ నాయుడు అనే పాతనేరస్తుడు, మరో ముగ్గరుని అరెస్ట్ చేశారు. ముఠాలో మిగిలిన నిందితుల సంగతి పక్కనబెడితే సుంకర ప్రసాద్ నాయుడు అనే వ్యక్తికి మాత్రం పెద్ద నేరచరిత్రే ఉంది. ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతడు. అతడిపై రికార్డుస్థాయిలో కేసులున్నాయి.

  ఇది చదవండి: వాట్సాప్ కు అమ్మాయిల ఫోటోలు పెడితే థ్రిల్ అయ్యాడు.. కాసేపటికే ఎకౌంట్ ఖాళీ..


  ఎవరీ ప్రసాద్ నాయుడు..?
  ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గుడిమెట్ట గ్రామానికి చెందిన సుంకర ప్రసాద్ నాయుడకి చిన్నతనం నుంచి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఏడో తరగతి చవిదే సమయంలోనే తనను మందలించాడంటూ స్కూల్ హెడ్ మాస్టర్ ను బెదిరించాడు. ఆ తర్వాత నక్సల్స్ సానుభూతిపరుడుగా మారి కొన్నాళ్ళు దేశంలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వా పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో గిద్దలూరులో జరిగిన ఓ గొడవలో అరెస్టై జైలుకు వెళ్లాడు. అక్కడ మొదలైన పరిచయాలతో నేరాల బాటపట్టాడు. ప్రస్తుతం అతడిపై 150 కేసులకు పైగా ఉన్నాయి.


  ఇది చదవండి: భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని 15 కత్తిపోట్లు.. నడిరోడ్డుపై దారుణం..


  ఐతే జైలు జీవితం గడుపుతున్న ప్రసాద్ లో మార్పు తీసుకొచ్చారు ప్రస్తుత హైదరబాద్ సీపీ సీవీ ఆనంద్, డీసీపీ నవీన్ కుమార్. అతడ్ని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. అతడితో చాయ్ దుకాణం ఏర్పాటు చేయించారు. అలాంటి ప్రసాద్ నాయుడు మళ్లీ నేరాల బాటపట్టడంతో పోలీసులే షాక్ తిన్నారు. ఐతే యూట్యూబ్ లో ప్రసాద్ నాయుడు ఇంటర్వ్యూలు చూసిన గుంతకల్లుకు చెందిన కొందరు అతడ్ని సంప్రదించారు. ముఠాగా ఏర్పడిన వీరు అదే ప్రాంతానికి చెందిన ఓ స్వామిజీని కిడ్నాప్ చేసి అతని వద్ద రూ.26 లక్షలు వసూలు చేశారు. ఈ దందాలో ప్రసాద్ నాయుడికి రూ.10లక్షలు ముట్టాయి. ఇదేదో బాగుందని భావించిన ప్రసాద్ నాయుడు.. మరో కిడ్నాప్ కు యత్నించి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రెండు కార్లు, ఒక బైక్, రూ.6లక్షల నగదు, ఓ గన్, 13 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Kidnap

  తదుపరి వార్తలు