G Venkatesh, News18, Anantapuram
మనకు భోజనం ఎంత అవసరమో.. నీరు అంతే అవసరం. కేవలం తాగడానికే కాదు.. స్నానం, కాలకృత్యాల వంటి పనులకు నీరు తప్పనిసరి. ఒక్కరోజు స్నానం చేయకుంటే ఒళ్లంతా చిరాకు పెట్టేస్తుంది. అలాంటిది మూడు రోజులు స్నానం లేకపోతే. మండు వేసవిలో చుక్కనీరు లేకపోతే అది నరకమే. అనంతపురం (Anantapuram) నగరంలో మూడు రోజులపాటు నీటికష్టాలు మొదలయ్యాయి. అనంతపురం నగరానికి మంచినీటిని సప్లై చేసే పైప్ లైన్ మరమ్మత్తుల కోసం నీటి విడుదలను నిలిపేశారు. అనంతపురం నగరంలోని కళ్యాణ్ దుర్గం రోడ్డు వద్ద రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా బ్రిడ్జి పనులు చేయాల్సిన సమయంలో నీటి పైప్లైన్ బ్రిడ్జి పనులకు అడ్డంగా మారింది.
దీనితో పైప్ లైన్ ను మరమ్మతులు చేయాల్సి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం నగరానికి కావలసిన నీటి కన్నా ఎక్కువగా విడుదల చేసి తరువాత సాయంత్రం నీటి విడుదలను ఆపివేశారు. సోమవారం సాయంత్రం నుంచి మరో రెండు రోజుల పాటునీటిని విడుదల చేయడానికి వీలు కాదని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం మరియు రాత్రి కూడా అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.
రాత్రి సమయంలో కూడా పనులు చేయనుండటంతోతొందరగా మరమ్మత్తులు చేసి నీటిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం లేకపోతే బుధవారం సాయంత్రం నీటినివిడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అనంతపురం ఎస్ ఈ సతీష్ చంద్ర తెలిపారు. అనంతపురం నగరం మొత్తానికి ఈ పైపులైన్ గుండనే నీటిని సరఫరాచేయాల్సి ఉంటుంది. నీటి సరఫరాను నిలిపివేయడంతో నగరంలో తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే అధికారులు సోమవారం మధ్యాహ్నం కావలసిన వాటికన్నా నీటిని ఎక్కువగానే వదలడంతో కొంతవరకు ఉపశమనం కలిగింది. కానీ మంగళవారం నీటి సమస్య ఎక్కువగా ఉంది. బుధవారం కూడా పైప్ లైన్ మరమ్మత్తులు పూర్తి కాకపోతే అనంతపురం నగరం తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలకుస్నానం చేయించేందుకు కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.కొంతమంది నగరంలో ముందు జాగ్రత్తగా నీటిని ఆదా చేసుకుని ఉన్నారు. కానీ కొన్నిచోట్ల తీవ్రమైన నీటి సమస్య ఎదురవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Water problem