G Venkatesh, News18, Anantapuram
అనంతపురం (Anantapuram) సప్తగిరి సర్కిల్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడిన నీరు దాదాపు అడుగు మేర నిలబడుతుంది. వాటికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణం. ఇది ఇప్పటి సమస్య కాదని చాలా కాలం నుంచి ఈ సమస్య కొనసాగుతోందని నగరవాసులు తెలుపుతున్నారు. నగర మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఈ పరిస్థితి ఏర్పడడం అధికారులు చర్యలు తీసుకోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మార్గం గుండా నడవడానికి కూడా చాలా కష్టంగా ఉందని... నడవలేక పోతున్నామని తమ బాధ ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు. ఎవరైనా పట్టించుకోని తగిన పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
సప్తగిరి సర్కిల్లో ముఖ్యంగా చాలా వాహనాలు తిరుగుతూ నిత్యం రద్దిగా ఉంటుంది. ఒకపక్క జనం మరోపక్క వాహనాలు తిరుగుతూ చాలా సమస్యగా ఉందనివాపోతున్నారు. అయితే ఇంతవరకు ఎందుకు సరియైన డ్రైనేజీ ఏర్పాటు చేయలేదో అధికారులకే తెలియాలి.సరియైన ఇంజనీరింగ్ అధికారి లేకపోవడమా లేక నిధులు కొరత లేక ప్రజలు ఇబ్బంది పడినమాకు అవసరం లేదని అనుకుంటున్నారా..? ప్రజలు ఎంత మోర పెట్టుకున్నా ఈ సమస్య ఇంకా ఎప్పటివరకు కొనసాగుతుందో చూడాలి.
దుకాణాల్లో ఏదైనా కొనుగోలు చేయాడానికి కూడా వెళ్లాలేక చాలా ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. వర్షం వస్తే వ్యాపారం తగ్గిపోతుందని యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు బయటకు రాలేక పోతున్నారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు ఏర్పాటు చేయాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
ఎందుకు ఇంత నిర్లక్ష్యం..?మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న పట్టించుకుని అధికారులు. నగరంలోని ఇతర సమస్యల గురుంచి ఇక ఎంత శ్రద్ద తీసుకొంటారో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి సమస్య ను పరిస్కారం చూపాలంటున్నారు ప్రజలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News