Home /News /andhra-pradesh /

ANANTAPURAM ONE PRIEST HARASSED HIS WIFE EXTRA DOWRY AND HARASSED WOMEN DEVOTEES IN ANANTAPURAM NGS NJ TPT

Crime News: భక్తి మార్గం చూపించాల్సిన పూజరి అతడు.. దెయ్యం పేరు చెప్పి వేసే వేషాలు తెలిస్తే.. ఛీ అంటారు

దేవుడి దగ్గరకు వెళ్లే దెయ్యం అని చెబుతున్న కామాంధుడు

దేవుడి దగ్గరకు వెళ్లే దెయ్యం అని చెబుతున్న కామాంధుడు

Crime News: అతడొక పూజరి.. దేవుడి దగ్గరకు వచ్చే వారికి భక్తి మార్గాన్ని చూపించింది.. నాలు మంచి మాటలు చెప్పి.. తీర్థ ప్రసాదాలు ఇవ్వాల్సిన పూజరి అతడు.. ఆయన్ను సైతం దేవుడిగా భావించి.. దండ కూడా పెడతారు భక్తులు కానీ.. ఆ పూజారి మాత్రం దెయ్యం పట్టిందనే పేరుతో.. మహిళలను వశపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇంకా చదవండి ...
    Crime News: భక్తులకు, దేవుడికి మధ్యలో ఉండే పూజారీ (Priest).. మన మొరను దేవుడికి వినిపిస్తారని నమ్ముతాం.. అలాంటి పుజారిని సైతం దేవుడిగానే భావిస్తారు చాలామంది.. అందుకే ఎంతో గౌరవంగా కాళ్లుమొక్కుతాం. అలా మనం కాళ్లు మొక్కే వ్యక్తే.. వెకిలి వేషాలు వేస్తే ఏమనాలి. ప్రస్తుతం కలికాలంలో ఎవ్వరిని నమ్మడానికి లేకుండా పోతుంది. బడిలో గుడిలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారుల నుంచి కాటికి కాలు చాపిన పండు ముసలి వరకు.. మహిళ అయితే చాలు వారికి రక్షణ లేకుండా పోతోంది. కామంతో కన్నుముసుకుపోయిన కొందరు కీచకులు.. తాము ఉన్నహోదా.. స్థానం అన్ని మరచి కామాంధులుగా మారుతున్నారు. దేవుడి సన్నిధి అయిన గుడిలో కూడా మహిళలకు రక్షణ (Women Safety) లేకుండా పోతే ఎలా.. అది కూడా ఆ కామంధుడి పూజారే అయితే ఇక బాధలు ఎవరికి చెప్పుకోవాలి. భక్తితో గుడికి వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు ఇవ్వాల్సిన ఆ పూజారి వక్ర బుద్ధికి అమయాక మహిళలు బలి అవుతున్నారు. దెయ్యం పేరు చెప్పి వారిని లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఆ పూజారి బాగోతం చివరికి బయటపడింది.

    అనంతపురం జిల్లా (Anantapuram District ) మురడి అంజన్న ఆలయంలో ఓ పుజారి బాగోతం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చే మహిళలను టార్గెట్‌ చేస్తూ తన కామవాంఛ తీర్చుకుంటున్నట్లు సమాచారం. మురడి అంజన్న ఆలయంలో అనంతసేవ అనే అర్చకుడికి 2008లో వివాహం అయ్యింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా.. అప్పటివరకు అంతా సాఫీగానే సాగింది. కానీ తరువాత అనంతసేన ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఆలయానికి వచ్చే మహిళలను.. మీకు దెయ్యం పట్టిందంటూ చెప్పడం ప్రారంభించాడు. మాములుగా మనిషికి దెయ్యం పట్టిందని.. అందులోనూ అంజన్న ఆలయంలోని అర్చకుడు చెబితే ఎంతటి వాళ్లయినా గుడ్డిగా నమ్మేస్తారు.



    అలా అతడి మాటలు నమ్మిన మహిళలను.. దెయ్యం వదిలించే వంకతో లొంగతీసుకుని రాసలీలు సాగిస్తూ వచ్చాడు. ఒకవైపు మహిళలతో కామవాంఛ తీర్చుకుంటూనే మరోవైపు అదనపు కట్నం కోసం భార్యను వేదించడం ప్రారంభించాడు. భార్యను ఇంట్లో నుండి గెంటేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు మాటలతో వేధించేవాడు. రోజు ఆలయానికి వచ్చే మహిళలు చాలా అందంగా ఉంటారంటూ…నువ్వు అలా ఎందుకు లేవంటూ భార్యను టార్చర్‌ చేసేవాడట.

    ఇదీ చదవండి : బీచ్‌కి వెళ్తున్నారా.. బిగ్ అలర్ట్.. ఆ బోర్డులు ఉంటే.. అటు వెళ్లకండి..

    ఆ భర్త ఆగడాలు భరించలేక పుట్టింటికెళ్లిపోయింది. గతంలో పెద్దమనుషుల పంచాయితీ జరిగిందని.. అయినా సరే బుద్ధిరాలేదని అనంతసేన భార్య చెబుతోంది. తనను అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదని.. నోటీసులు పంపి వేధించేవాడని అనంత భార్య స్రవంతి ఆరోపిస్తున్నారు.

    దీంతో స్రవంతి బయటకు వచ్చి తన భర్త ఆగడాల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దెయ్యాలు పట్టిన ఆడవాళ్లు వస్తే వాళ్లను వశపరుచుకుని తన కామవాంఛ తీర్చుకుంటాడని అనంతసేనపై స్రవంతి మండిపడ్డారు. అనంతసేన ఫోన్‌లో అలాంటి ఫొటోలు, వీడియోలు చాలా ఉన్నాయని ఆరోపించింది. ఇప్పటికైనా పోలీసులు అతడి నేరాలను గుర్తించి తనకు న్యాయం చేయాలని స్రవంతి కోరుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు