Face recognition: ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు (Government Teacher) మొక్కు తీర్చుకునేందుకు గుండు చేయించుకోవడమే శాపంగా మారింది. సమస్యలు తీర్చాలని దేవుడి గుడికెళ్లి గుండు గీయించుకొని మొక్కు చెల్లించుకున్న ఫలితానికి.. పాపం అతడి ఉద్యోగానికే ఎసరుగా మారింది. పాపం జాబ్ నుంచి సస్పెండైన సదరు ప్రభుత్వ టీచర్ ను అధికారులు తొలగించారు. కారణం ఏంటో తెలుసా..? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉపాధ్యాయులకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం అన్ని ఆన్ లైన్ అంటోంది. ఆఖరి హాజరు విషయంలోనూ కఠినంగానే ఉంటోంది. దాని కోసం ఫేసియల్ రికగ్నేషన్ యాప్ ని తీసుకొచ్చారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇలాంటి ప్రయాత్నాలు మంచివే కానీ.. ఆ యాప్ పనితీరును మాత్రం పరిశీలించడం లేదు. అందులో ఉన్న లోటు పాట్లను.. సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించకుండా టీచర్లపై ఒత్తిడి తేవడం తీవ్ర వివాదమవుతోంది.
తాజాగా జరిగిన ఘటనే అందుకు ఉదహరణ. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మేలాపురం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆదినారాయణ అనే టీచర్ గత నెల 5న కర్ణాటకలోని పావగడ శనేశ్వర స్వామి గుడికి వెళ్లి గుండు గీయించుకొని మొక్కులు తీర్చుకున్నారు..
ఆ తరువాత యధావిధిగా తన విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చి ఫేషియల్ యాప్ లో హాజరు వేయబోయారు. కానీ సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి ఫోటో ఒకేలా లేకపోవడంతో.. ఆ యాప్.. నుంచి ఊహించిన సమాధానం వచ్చింది. ఈ మొహం నీది కాదంటూ రిజెక్ట్ చేసింది.
ఇదీ చదవండి : రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపైకి సీఎం జగన్ , చంద్రబాబు .. ఎందుకంటే..?
దీంతో ఆ టీచర్ ఆదినారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ సంఘటనపై మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయింది. ప్రభుత్వంపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. టీచర్ ఆదినారాయణకు ఈ నెల 17న మెమో జారీచేశారు. దీనికి ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ వివరాలను పత్రికలకు తాము లీక్ చేయలేదని విన్నవించుకున్నారు. అయినా ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
ఇదీ చదవండి : రాజధాని జిల్లా అయినా అధికార పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందా..? కారణం ఇదే..?
ఉన్నతాధికారులతో చెప్పి సమస్యను పరిష్కరించుకోవాల్సిన టీచర్.. మీడియాకు చెప్పడం ఏంటంటూ అధికారులు సీరియస్ అయ్యారు. లేటెస్ట్గా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీఈవో మీనాక్షి. యాప్‌లోని లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Ap government, AP News