హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Family Lock down: రెండేళ్లుగా లాక్‌డౌన్‌లోనే కుటుంబం.. కారణం తెలిసి షాక్ అయిన స్థానికులు

Family Lock down: రెండేళ్లుగా లాక్‌డౌన్‌లోనే కుటుంబం.. కారణం తెలిసి షాక్ అయిన స్థానికులు

ఫ్యామిలీ లాక్ డౌన్

ఫ్యామిలీ లాక్ డౌన్

Family Lockdown: లాక్ డౌన్ సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారం రోజులు ఏ పనిలేక ఇంట్లోనే ఉండాలి అంటే.. జీవితం పై చిరాకు వస్తుంది. అలాంటి ఓ కుటుంబం మాత్రం ఒకటి రెండు వార్తలు కాదు.. రెండేళ్లు గా ఇంటికే పరిమితం అయ్యంది.. విద్యుత్ లేదు.. నీళ్లు లేవు అయినా అలాగే గడిపేశారు. కాలు బయట పెట్టలేదు.. కారణం ఏంటో తెలుసా?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  Family Lockdown: లాక్ డౌన్ (Lock down) అంటేనే భయపడే పరిస్థితి. ఎందుకంటే..? గతంలో కరోనా (Corona) కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలో.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక నరకం అనుభవించారు. కేవలం ఒకటి రెండు వారాలు ఇంట్లో కదలకుండా ఉంటే.. ప్రాణం పోయినంత పని అయ్యేది చాలామందికి.. అలాంటింది ఒక కుటుంబం.. గత రెండేళ్లుగా అనంతపురంలో వింత జీవితం గడుపుతున్న ముగ్గురు కుటుంబసభ్యుల (Three Family Members) (అక్క, చెల్లి, తమ్ముడు) ఘటన వెలుగులోకి వచ్చింది. వేణుగోపాల్ నగర్ లో ఓ ఇంట్లో ఈ ముగ్గురు కుటుంసభ్యులు గత రెండేళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా గడుపుతున్నారు. వారి ఇంటి తలుపులు వేసినవి వేసినట్టే ఉంటున్నాయి. ఇంటికెవరూ రావడం లేదు. ఇంటి నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు. కరెంట్ కూడా లేదు. అయినా అలాగే కాలం వెళ్లతీస్తున్నారు. ఇంటిని శుభ్రం చేయలేదు. కనీసం స్నానం కూడా చేయలేదు. జట్టు పెరిగి జడలుగా అట్ట కట్టాయి. గోళ్లు విపరీతంగా పెరిగాయి.

  ఇలా రెండేళ్లు స్నానం, శుభ్రం లేక.. ఇళ్లంతా దుర్గందం వ్యాపించింది. అలాగే వారు తిన్న ఆహార పొట్లాలు సైతం గుట్టలు గుట్టలుగా అక్కడే పడేశారు. అసలు ఇంటికే కాదు.. ఒంటిని కూడా శుభ్రం చేసుకోలేదు. దీంతో జట్టు జడలు కట్టింది. గోళ్లు భారీగాపెరిగాయి. ఒంటినిండా మట్టి పేరుకుపోయింది. దీంతో ఇళ్లంతా దుర్గంధం. ఆ స్మెల్ అంతా పక్కింటి వారికి వ్యాపించడంతో కార్పొరేషన్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

  వెంటనే రంగంలోకి దిగిన కార్పొరేషన్ సిబ్బంది విషయం ఏంటని ఆరా తీస్తే దిమ్మతిరిగిపోయే నిజం వెలుగుచూసింది. కార్పొరేషన్ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో, లోకల్ కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారంతా వీరికి ధైర్యం చెప్పి మళ్లీ సాధారణ జీవితం గడిపేలా చర్యలు తీసుకున్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలతో పాటు కార్పొరేషన్ సిబ్బందితో ఇంటిని శుభ్రం చేయించారు.

  ఇదీ చదవండి : శ్రీ‌నిధికి 14, ల‌క్ష్మీకి 45 ఏళ్లు.. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఇవే ప్రత్యేక ఆకర్షణ.. వాహన సేవల కోసం ప్రత్యేక శిక్షణ

  రెండేళ్ల పాటు ఇలా ఇంటికే ఎందుకు పరిమితం అయ్యారు..? కనీసం స్నానం.. బ్రస్ కూడా ఎందుకు చేయలేదు..? రెండేళ్ల పాటు వీరికి ఆహారం ఎలా వచ్చింది..? అని ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మా, నాన్న చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఒక్కోసారి ఆ తమ్ముడు రోడ్డుపైకి వెళ్లి.. ఆహారం తెచ్చేవాడు.. దానితో ఇలా రెండేళ్లు గడిపేశారు.

  ఇదీ చదవండి : వైసీపీ స్ట్రాటజీ మార్చిందా..? జూనియర్ ఎన్టీఆర్ ను లైన్ లో పెట్టడానికి కారణం అదేనా..?

  ముగ్గురు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు వచ్చేలా చేశారు పోలీసులు. బూజు పట్టిన ఇల్లు, జడలు కట్టిన జుట్టుతో దర్గంధం వెదజల్లుతూ స్మశానాన్ని తలపించిన వాతావరణం నుంచి సామాన్య జనంలో కలిసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో నిన్నటి వరకు చీకట్లో మగ్గిన వారు కూడా ఇక నుంచి సాధారణ జీవితం గడుపుతామని చెబుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు