ANANTAPURAM ONE ADVOCATE INJURED BY TWO BULL FIGHT THEN FILE CASE AGAINST MUNICIPAL CORPORATION TADEPALLI NGS GNT
AP News: ఎద్దుల కుమ్ములాటలో న్యాయవాదికి గాయాలు.. కార్పొరేషన్ అధికారులపై కేసు
ఎద్దుల కుమ్ములాటలో గాయాలు
AP Fight: ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చిందంటే ఇదేనేమో? రెండు ఎద్దుల కుమ్ములాటలో.. ఓ న్యాయవాది గాయపడ్డాడు. దీంతో కార్పోరేషన్ అధికారుల పై కేసు నమోదైంది.. ఎందుకంటే..? ఎక్కడో తెలుసా..?
AP News: ఎంకి పెళ్లి సుబ్బుచావుకి రావడం అంటే ఇదేనేమో..? కొన్ని ఘటనలు చూస్తే ఇలాంటి సామెతలు నిజమే అనిపిస్తాయి. ఒక్కో సారి బాధ్యులు ఒకరైతే.. శిక్షలు వారు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక్కోసారి పరోక్ష కారణం కావొచ్చు.. మరికొన్ని సార్లు సంబంధం లేకుండానే కేసులు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అది కూడా ఘటన ఎప్పుడో జరిగితే.. కొన్ని నెలల తరువాత కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. గుంటూరు జిల్లా (Guntur District) లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అది మంగళగిరి మార్కెట్ (Mangalagiri Market) సెంటర్... ఆ రోజు ఏప్రిల్ 19... సమయం సాయంత్రం 4 గంటలు. మార్కెట్ సెంటర్ కావటంతో వచ్చి పోయే వారితో రద్దీగా ఉంది. అదే రహదారిపై ఒక యువ న్యాయవాది (Advocate) వెలుతున్నాడు. హైకోర్టులో పని చేసే న్యాయవాది సరుకులు కొనుగోలు చేసేందుకు షాపు వద్దకు వెలుతున్నాడు. ఆ సమయంలో ఊహించని ఘటనతో అతడికి గాయాలు అయ్యాయి.
అతడి పేరు గోలి కోటేశ్వరరావు. అదే సమయంలో రెండు ఎద్దులు తీవ్రంగా పోట్లాడుకుంటున్నాయి. ఎద్దుల పోట్లాటను గమనించని లాయర్ తన పనిలో నిమగ్నమై వెలుతున్నాడు. పోట్లాడుతున్న ఒక ఎద్దు అకస్మాత్తుగా వచ్చి రోడ్డు వెంట వెలుతున్న అడ్వకేట్ ను ఢీ కొట్టింది. లేచి వెళ్ళే లోపలే మరొసారి పొడిచింది. దీంతో ఏం జరిగిందో తెలిసే లోపలే కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. కుడి చెయ్యి, కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించారు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావటంతో నెల రోజుల పాటు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటనపై తీవ్ర మనస్థాపం చెందిన న్యాయవాది మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పోరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా ఎద్దులను రోడ్డుపై వదిలి పెట్టారని, అవి ఢీ కొనడంతో తాను తీవ్రంగా గాయపడ్డానని అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. కానీ ఆ కేసును మంగళగిరి పోలీసులు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.
స్వయంగా అడ్వకేట్ అవ్వడంతో.. పట్టు వదలని అతడు కేసు నమోదు చేయాలని సంకల్పించాడు. దీంతో ఘటన జరిగిన రెండు నెలల తర్వాత మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 289 కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.
న్యాయవాది ఒక్కడే కాదు తాము కూడా రోడ్డుపై వదిలి పెట్టిన ఎద్దులు, అవులతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్పోరేషన్ అధికారులు స్పందించి ఆవులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.