G.Venkatesh, News 18, Ananthapur
అనంతపురంలో దొరికే పిండివంటలలో ఓళిగా చాలా స్పెషల్ పిండి వంటకం. వీటి గురించి తెలియని వారు ఉండరు. రుచి చూడని వారు ఉండరు. ఇది ముఖ్యంగా అనంతపురంలో రుచికరమైన పిండి వంటకం. చాలా బాగుంటుంది.
అనంతపురం నగరంలోని ఏసు నగర్లో రామాలయం టెంపుల్ దగ్గర ఓళిగా చాలా స్పెషల్‌గా ఎక్కువ షాప్‌లో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫంక్షన్ కి ఆర్డర్ చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు, రిసెప్షన్స్,శ్రీమంతం మరియు సాంప్రదాయ ఫంక్షన్ కి స్వీట్ ఎక్కువగా ప్రిపేర్ చేసే ఫంక్షన్స్‌కి ఈ ఓళిగతీసుకెళ్తారు. ఇక్కడ ఓళిగాతో పాటు చాలా రకాల పిండివంటలు కూడా లభిస్తాయి. అత్తారాసలు, చక్కిలాలు, ఇంకా చాలా రకాల పిండివంటలు దొరుకుతాయి. వీటిలో ముఖ్యంగా అనంత వాసులు వివిధ ప్రాంతాలవారు ఎక్కువగా ఇష్టపడేది ఓలిగ. ఇది బాగా గుర్తింపు పొందింది.
Read This : Mulugu: ములుగు ఏజెన్సీతో సినీ గాయని సునీతకు ఉన్న బంధం ఏంటో తెలుసా?
వీటి తయారీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఓళిగా పిండి తీసుకొనిపూర్ణం మధ్యలో పెట్టి ఓళిగలు తయారు చేస్తారు. ఓలిగలు వివిధ రకాలుగా ఉన్నాయి. కొబ్బరి ఓలిగా బెల్లంతో చేసిన ఓలిగ... నెయ్యితో చేసిన ఓళిగాఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగాదామోదర్ గుప్తా ఓళిగా సెంటర్... ఇవిలో చాలా అద్భుతంగా ఉంటాయని...ఇక్కడ నగరవాసులు కూడా తెలిపారు.
వీరికి ముందే ఆర్డర్ ఇస్తే మీరు సప్లై చేస్తామని చెబుతున్నారు. ఈ సెంటర్20 సంవత్సరాల నుంచి నడుపుతున్నామని నిర్వాహుకుడు చెబుతున్నారు.వీరు నగరం నుంచే కాక వివిధ ప్రాంతాల్లో కూడా సప్లై చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఇటీవల వీర సింహారెడ్డి షూటింగ్ జరిగింది. షూటింగ్లో భాగంగా డైరెక్టర్లుకిఇతర పనిచేసే సిబ్బందికి తమ సెంటర్ నుంచే ఓళిగలుసప్లై చేశామని తెలిపారు.
వీటి గురించి ముఖ్యంగా రాజీవ్ కనకాల చాలా బాగున్నాయని కితాబిచ్చారనిదామోదర్ గుప్తా తెలిపారు.ఇక్కడ ఓళిగా అద్భుతంగా ఉంటుందని న్యూస్ 18 తో నగరవాసులు తెలిపారు. కరువు కేంద్రమైన అనంతపూర్ జిల్లాలో ఇలాంటి ప్రత్యేకతలు ఉండడం మరియు ప్రత్యేకతగా పిండివంటలు నిలవడం నగరవాసులు కూడావాటిని రుచికరంగా తినడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్లి రుచిచూడండి మీ అనుభూతిని ఇతరులతో పంచుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News