హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ జిల్లా యువతకు గుడ్ న్యూస్.. ప్రభుత్వాస్పత్రిలో జాబ్స్.. వివరాలివే..!

ఆ జిల్లా యువతకు గుడ్ న్యూస్.. ప్రభుత్వాస్పత్రిలో జాబ్స్.. వివరాలివే..!

అనంతపురం జిల్లా వైద్య శాఖలో ఉద్యోగాలు

అనంతపురం జిల్లా వైద్య శాఖలో ఉద్యోగాలు

అనంతపురం జిల్లా (Anantapuram) వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

అనంతపురం జిల్లా (Anantapuram) వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రభుత్వం కోవిడ్ సమయంలో నుండి వైద్య శాఖపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తూఉంది. ఇంతకు ముందే అనంతపురం వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను విడతలవారీగా భర్తీ చేస్తూ వస్తుంది. జిల్లాలోని వైద్య శాఖలో వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ భర్తీ ప్రక్రియ అనేది కొనసాగుతూనే వస్తూనేఉంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.కోవిడ్ వచ్చినప్పుడు నుంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సదుపాయాలను అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఖాళీలుఉన్నాయో వాటిని క్రమం తప్పకుండా భర్తీ చేస్తూ ఉంది.

ఇందులో భాగంగానే తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్టు(ఎస్టీ మహిళ), టిబి హెల్త్ విజిటర్ (విహెచ్ మహిళా ఓసి జనరల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి అనుపమ జేమ్స్ తెలిపారు.

ఇది చదవండి: ఆ జిల్లాలో ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్.. వారికి మాత్రమే.. వివరాలివే..!

అర్హత కలిగిన అభ్యర్థులుఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తారీకు వరకు సాయంత్రం ఐదు గంటల లోపు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకునే వారు మిగిలిన వివరాల కోసం ananthapuramu.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Ap jobs, Local News