అమ్మాయిల మోజులో పడి బలవుతున్న యువత. అమ్మాయిలను, మహిళలను ఎరగా వేసికొందరి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నఏమాత్రం పట్టించుకోకుండాఅధికారులు ఉన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకి తెలియదంటే నమ్మశక్యం కానీవిషయం. వివిధ షాప్ పేర్లు పెట్టుకొనిలోపల సాగిస్తున్న కార్యక్రమాలు వేరేగా ఉన్నాయి. తెలియని వారు వెళితే లోపల ఎవరు లేరని చెప్పడం మరియు తెలిసిన వారి ద్వారానే వారు అన్ని నడుపుతున్నారని తెలుస్తుంది.
ఇంతకుముందు ఇక్కడికి వచ్చి వెళ్లిన వారి పేరు చెప్తేనే వారు లోపలికి అనుమతిస్తారు. వారు అలా గుట్టుగా వ్యభిచారం నడుపుతున్నారు. ఎంతో మంది జీవితాలు అలాంటి కార్యక్రమాలు వల్ల నాశనం అవుతున్నాయి. అంతేకాక అలాంటి కార్యక్రమం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే మన దేశంలో లైంగిక కార్యక్రమాల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత తెలిసినా కూడా అధికారులు స్పందించకపోవడం కొసమెరుపు.
అశోక్ నగర్లో ఎల్లమ్మ దేవాలయం దగ్గరలోనే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడడందురదృష్టకరం. ముఖ్యంగా యువత ఇలాంటి వాటికి బానిస అయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనిసమాచారం. అంతేకాక ఆల్కహాలు సేవించి మరియు వివిధసదుపాయాలు కూడా లోపల కల్పిస్తున్నారని తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలు వల్ల సమాజం నాశనం అవుతుంది. ముఖ్యంగా చదువుకోడానికి వచ్చిన యువతను ఎక్కువగా ఆకర్షిస్తూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు.
Kurnool: ప్రేమించి పెళ్లి చేసుకోవడమే పాపం.. యువకుడికి ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ..
అంతేకాక ఎంతోమంది జీవితాలనుకూడా నాశనం చేస్తున్నారు. డబ్బుకి ఆశపడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేగాని వీటివల్ల ఎంత నష్టం జరుగుతుందో గుర్తించలేకపోతున్నారు. సమాజంలో వీటి గురించి ఎంత అవగాహన కల్పించిన వీటికి బానిసలుగా మారుతున్నారు. పెళ్లి అయిన వారు కూడా ఇలాంటి వాటికి పాల్పడడంతో వారి కుటుంబాలు కూడా చాలా నష్టపోతున్నాయి. వీటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స కూడా లేకపోవడంతో వారు ఇక జీవితం కోల్పోయినట్టుగా అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అలాంటి గృహాలపై దాడులు చేసి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Crime news, Local News