హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapuram: నాడు-నేడు ఈ ఆస్పత్రికి వర్తించదా..? ప్రజలకు ఇప్పుడేం చెప్తారు..?

Anantapuram: నాడు-నేడు ఈ ఆస్పత్రికి వర్తించదా..? ప్రజలకు ఇప్పుడేం చెప్తారు..?

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాల కొరత

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాల కొరత

Anantapuram: పేద ప్రజలకు వైద్యం అందాలంటే ప్రభుత్వాస్పత్రులే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు ఖర్చు చేయలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. కానీ సర్కారీ దవఖానాల్లో మాత్రం సౌకర్యాల లేమి వారి ప్రాణాలమీదకు తెస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

పేద ప్రజలకు వైద్యం అందాలంటే ప్రభుత్వాస్పత్రులే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు ఖర్చు చేయలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. కానీ సర్కారీ దవఖానాల్లో మాత్రం సౌకర్యాల లేమి వారి ప్రాణాలమీదకు తెస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లోనూ సరైన వసతులు లేకపోవడంతో పేదలంతా దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. నిత్యం వందలాది మంది రోగులు వచ్చే ఆస్పత్రులను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవం నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అనంతపురం (Anantapuram) నగరంలోని ప్రభుత్వాస్పత్రికి నిత్యం వందలాది మంది రోగులు ఆస్పత్రికి వస్తూ ఉంటారు. రోగులతో పాటు వారి బంధువులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరికి ఇక్కడ సరైన సదుపాయాలు కూడా లేకుండా పోయాయి. హాస్పిటల్ లో త్రాగడానికి మంచినీరు కూడా సరిగా దొరకడం లేదు.

మొత్తం వందలాదిమంది ఈ ప్రభుత్వ ఆసుపత్రికిప్రతిరోజు వస్తూ ఉంటారు. అంతేకాక హాస్పిటల్ నందు రోగులు బంధువులు రెండు మూడు రోజులు ఉండి వెళ్తూ ఉంటారు.అలాంటి వారికి ఇక్కడ సరైన సదుపాయాలు లేక అవసరాలకు సరిపడా నీరు కూడా సరిగా అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత రోగులకి మరియు వారి బంధువులకు ఇక్కడ సదుపాయాలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి.

ఇది చదవండి: బెజవాడలో ఎవరిష్టం వాళ్లది..! ఏం చేసినా పట్టించుకోరా..?

ఆసుపత్రికి వచ్చినవారు బయట నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకోవటంవల్ల వారికి అదనపు భారం కూడా అవుతుంది. ఇక్కడే మంచినీరు సదుపాయం కల్పించాలని రోగులు కోరుతున్నారు.ఆసుపత్రిలో కనీసంపడుకోవడానికి మరియు అంతేకాక రోగుల బంధువులకి బయట కూర్చోవడానికి కూడా సరైన సదుపాయాలు లేవు.వారి రోజువారి అవసరాలకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహణకి ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసిన సదుపాయాలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి.

ఇది చదవండి: వీటిని పార్కులంటారా..? అధికారులు పట్టించుకోరా..?

అయితే ఇక్కడ నిర్వహణ లోపమా లేకపోతే అవినీతి అన్నది తెలియాలి. అంతేకాక ఈ ప్రభుత్వ హాస్పిటల్లో చాలా సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు స్పందించి రోగులకు, మరియు వారి బంధువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మరియు అనంతపురం జిల్లా వ్యాప్తంగా చాలామంది హాస్పిటల్​కి వస్తూ ఉంటారు. కాబట్టి అధికారులు కూడా సరైన వైద్యం సదుపాయాలు కల్పించాలని ఇక్కడికి వచ్చే రోగులు రోగులు బంధువులు కోరుతున్నారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు