.Venkatesh, News 18, Ananthapur
అనంతపురం (Anantapuram) నుంచి గుంటూరు (Guntur) కు హైవే నెంబర్ 544 డి ప్రారంభమైంది. నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 417.95 కిలోమీటర్ల 9వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించి అభ్యర్థన మేరకు NH544 డి నిర్మాణానికి కేంద్రం విపరీతల రవాణా జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (National Highway Authority of India ) టెండర్లను ఖరారు చేసింది. అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్ ప్రెస్ కోసం ఎన్హెచ్ ఏఐ గతంలో ప్రతిపాదించింది, అందుకోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి.
అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూమిని ప్రభుత్వం అటవీ శాఖకు కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర అటవీ శాఖ అనుమతులు నిరాకరించింది. అయితే ప్రభుత్వం చలువతో ఈ మధ్యకాలంలో అన్ని అనుమతులు లభించడంతో అనంతపూర్ నుంచి గుంటూరు నేషనల్ హైవే పనులు ప్రారంభమయ్యాయి.
ఈ రోడ్డు మార్గాన్ని రెండు సంవత్సరాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. హైవే అనంతపూర్ నుంచి కర్నూలు , ప్రకాశం , గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలతో కలుపుకొని వెళ్తుంది.. అనంతపురంలో 73.11 కిలోమీటర్లు మేర హైవే వెళుతుంది. మొదటి ప్యాకేజీలో పామురాయి నుంచి ముచ్చుకోట వరకు 39.33 కిలోమీటర్ల మేర 684 కోట్ల నిర్మాణ వ్యయంతో రహదారిని నిర్మిస్తారు.
ఇదీ చదవండి : జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం.. షాక్ ఇచ్చారా ?
దీనిని ఎల్ వన్ కాంట్రాక్టర్ ఎస్ఆర్సీదక్కించుకుంది. రెండవ ప్యాకేజీలో భాగంగా ముచ్చుకోట నుంచి బుగ్గ వరకు 32 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు 738 కోట్లుతో నిర్మాణం ప్రారంభిస్తారు. దీన్ని మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సొంతం చేసుకుంది. అనంతపురంలో 73 కిలోమీటర్ల మేర పనులు చేపడతారు.దీనితో అనంతపూర్ నుంచి గుంటూరుకి వెళ్లే నేషనల్ హైవే వల్ల రవాణా ఇతర ప్రయాణలు సులభతరం అవుతాయి. ఇంతకుముందు అనంతపూర్ నుంచి స్ట్రైట్ రోడ్ ఏది లేకపోవడంతో ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉండేది.
ఇదీ చదవండి : మొన్నటి వరకు ఇంజనీర్.. ఇప్పుడు రైతు.. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
ప్రయాణ సమయం కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ నేషనల్ హైవే పూర్తి అవ్వడంతో రవాణా చేయడానికి, ఇతర ప్రయాణాలు చేయడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. ఈ నేషనల్ హైవే పూర్తి అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో రెండు జిల్లాల ప్రజలు ఈ రోడ్డు ఎంత వేగంగా పూర్తి అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Guntur, Local News