హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పంతం నెగ్గించుకున్న వైసీపీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు..

పంతం నెగ్గించుకున్న వైసీపీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు..

గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి

గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి

Andhra Pradesh: రాష్ట్ర మొత్తం ఎంత ఉత్కంఠంగా సాగుతున్న ఎమ్మెల్సీ పోరులో ఎవరుపై చేయి సాధిస్తారో అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

రాష్ట్ర మొత్తం ఎంత ఉత్కంఠంగా సాగుతున్న ఎమ్మెల్సీ పోరులో ఎవరుపై చేయి సాధిస్తారో అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ పోరులో రాబోయే జనరల్ ఎలక్షన్స్ కి ఇది కీలక ఘట్టంగా మారే అవకాశాలు ఉండటంతో అందరిచూపు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైనే ఉంది. అనంతపురం నగరంలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో ఎట్టకేలకు వైసీపీ అభ్యర్థి ఎం వీ రామచంద్ర రెడ్డి గెలుపొందారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో విజేతగా ఎం వీ రామచంద్రా రెడ్డి ధ్రువీకరణ పత్రం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అందజేశారు. అనంతపురము-కర్నూల్ ఉపాధ్యాయ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించిన ఎం వీ రామచంద్రా రెడ్డిని విజేతగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు.

జేఎన్టీయూ వర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా ప్రాంగణం వద్ద ఎంవీ రామచంద్రారెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఎన్నికలో ప్రాథమిక ఓట్ల బదిలీ చేస్తూపోగా చివరికి ఇద్దరు అభ్యర్థులు ఎంవీ రామచంద్రా రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి పోటీలో నిలిచారన్నారు.

ఈ ఎన్నికలో ప్రాధాన్యత ఓట్ల బదిలీ అనంతరం సైతం ఎవరికీ 50 శాతం పైగా ఓట్లు దక్కలేదని, నిబంధనల ప్రకారం అత్యధిక ఓట్లు సాధించిన ఎంవీ రామచంద్రా రెడ్డిని విజేతగా ప్రకటించామని తెలిపారు. సంపూర్ణ ప్రాధాన్యత ఓట్ల బదిలీ అనంతరం ఎం వీ రామచంద్రా రెడ్డి 10,787 పొందారు. సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డికి 10,618 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 25,272 ఓట్లు పోలవ్వగా, వాటిలో 3,867 ఓట్లు చెల్లని ఓట్లు/ప్రాధాన్యత బదిలీ అనంతరం విలువ కోల్పోయిన ఓట్లుగా మిగిలాయి.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News, Ysrcp

ఉత్తమ కథలు