హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

SK University: వర్సిటీలో మృత్యుంజయ హోమం రద్దు.. ఇంటి దగ్గరే చేయాలని నిర్ణయం.. వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా?

SK University: వర్సిటీలో మృత్యుంజయ హోమం రద్దు.. ఇంటి దగ్గరే చేయాలని నిర్ణయం.. వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా?

ఎస్కే యూనివర్శిటీ వివాదం ముగిసినట్టేనా?

ఎస్కే యూనివర్శిటీ వివాదం ముగిసినట్టేనా?

SK University: మృత్యుంజయ హోమం రద్దు అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం వివాదానికి బ్రేక్‌ పడింది. యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి ఇంటికి హోమాన్ని షిఫ్ట్‌ చేశారు వీసీ. అసలీ వివాదం ఏంటి? ఎందుకు వెనక్కి తగ్గారో ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

SK University: గత వారం రోజులుగా వివాదాలతో దద్దరిళ్లింది అనంతపురం (Anantauram) శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (Sri Krishna Viswavidyalayam) .. అందుకు ప్రధాన కారణం.. యూనివర్శిటీలో చేయతలపెట్టిన ధన్వంతరి మృత్యుంజయ హోమం.. అయితే వివాదం తీవ్రం అవ్వడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. వర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించాలనుకున్న శాంతి హోమాన్ని రద్దు చేస్తున్నట్టు సర్క్యులర్‌ జారీ చేశారు ఎస్కేయూ రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య. ఈ హోమాన్ని తన ఇంట్లోనే నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇందు కోసం మొత్తం ఏర్పాట్లను తన ఇంట్లోనే చేస్తున్నారు. హోంలో పాల్గొనేవారు తన ఇంటికి వస్తారని వెల్లడించారు. రిజిస్టార్ లక్ష్మయ్య తీసుకున్న నిర్ణయంతో వివాదకు ఎండ్ కార్డ్ పడుతుందని ఆశిస్తున్నారు. అసలు హోం ఎందుకు చేయాలనుకున్నారు.. వివాదం ఎందుకు ముదిరింది అంటే.. పూర్తి వివరాలు పరిశీలిస్తే..

ఎస్ కే యూనివర్శిటీంలో హోం చేస్తున్నారని.. దానికి చందాలు వసూలు చేస్తున్నారని తెలియగానే.. వివాదం ముదిరింది. విజ్ఞానాన్ని నేర్పించాల్సిన యూనివర్సిటీలో ఎలా హోమాలు నిర్వహిస్తారంటూ హేతువాద, విద్యార్ధి సంఘాలు ఆందోళనలకు దిగాయ్‌. ఇలాంటి హోమాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే యూనివర్సిటీ బయట చేసుకోవాలని, కాదని మొండిగా హోమం నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

కానీ యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం తలపెట్టడాన్ని సమర్ధించుకున్నారు ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి. ఉద్యోగుల క్షేమం కోసమే యాగం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చందా వసూలు కోసం సర్క్యులర్‌ ఇచ్చింది కూడా నిజమేనన్నారు వీసీ. అంతేకాదు, ఈనెల 24న యూనివర్సిటీ స్టేడియంలో యాగం చేయబోతున్నట్లు తేల్చిచెప్పారు. వచ్చేవాళ్లు రావొచ్చు-ఇష్టంలేనోళ్లు రావక్కర్లేదంటూ ప్రకటనలు కూడా గుప్పించారు. నెలరోజుల్లో ఐదుగురు ఉద్యోగులు చనిపోయారని, అందుకే మృత్యుంజయ హోమం తలపెట్టినట్టు చెప్పుకొచ్చారు. వీసీ రామకృష్ణారెడ్డితో పాటు రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య కూడా యూనివర్సిటీలో మృత్యుంజయ హోమాన్ని సమర్ధించుకున్నారు. చేస్తే తప్పేంటంటూ మాట్లాడారు రిజిస్ట్రార్‌. ఉద్యోగుల్లో భయం పోగొట్టడానికే ఈ హోమం అంటూ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : ఈ 5 రాశుల వారికి అకస్మిక ధనలాభం.. గజలక్ష్మీ రాజయోగమే కారణం.. అందులో మీరున్నారా?

విద్యను బోధించాల్సిన చోట హోమాలు నిర్వహించడం ఏంటని వీసిని నిలదీశారు విద్యార్థి నేతలు.. హేతువాద సంఘం నేతలైతే వీసీ రామకృష్ణారెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ విద్యావంతుడైయుండి ఇలాంటి నిర్ణయాలంటి అని మండిపడ్డారు. అటు ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ అయనట్టు సమాచారం. ఈ వివాదానికి బ్రేకులు వేయాలనే ఉద్దేశంతో మహా మృత్యుంజయ హోమాన్ని రద్దు చేస్తూ ఎస్కేయూ రిజిస్ట్రార్ లక్ష్మయ్య సర్క్యలర్ విడుదల చేశారు. ఎస్కే యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ లో ఆయన పేర్కొన్నారు

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, University

ఉత్తమ కథలు