హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: వాహనదారులు జాగ్రత్త..!

Andhra Pradesh: వాహనదారులు జాగ్రత్త..!

ఇబ్బందులు పడుదున్న వాహనదారులు

ఇబ్బందులు పడుదున్న వాహనదారులు

Andhra Pradesh: శీతాకాలం వచ్చిందంటే చాలు పొగమంచు తెల్లవారుజామున కమ్మేస్తుంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపై పొగమంచు ఎక్కువ ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించవు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

G.Venkatesh, News 18, Ananthapur

శీతాకాలం వచ్చిందంటే చాలు పొగమంచు తెల్లవారుజామున కమ్మేస్తుంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపై పొగమంచు ఎక్కువ ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించవు. దీనితో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురంలో వేసవిలో ఎక్కువ వేడిగానూ చలికాలంలో ఎక్కువ చల్లగానూ మంచుతో కప్పినట్టు ఉంటుది.

రాయలసీమలో అనంతపురంలో శీతోష్ణాస్థితి పరిస్థితులు రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. ఉదయం పూట మంచు ఎక్కువగా కప్పబడి ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు శీతాకాలంలో ఎక్కువగా వాహనాలూ ఎదురెదురుగా ఢీ కొనడం మరియు వెనక నుండి ఢీకొనడం జరుగుతూ ఉంటాయి. వాహనాలకు లైట్లు ఉన్నా కూడా ఎదురుగా వస్తున్న కనిపించవు. ఇటీవల ఇలాంటి ప్రమాదాలు జరగడం మనం గమనించే ఉంటాం. కావున అందరు జాగ్రత్త వహించాలి పెద్ద వాహనాలు కాకుండా చిన్న చిన్న వాహనాలతో మనం జాగ్రత్తగా ఉండాలి.

అత్యవసరం అయితే తప్ప తెల్లవారుజామున మనం ప్రయాణించ కూడదు. తెల్లవారుజామున మనం ప్రయాణించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెంట్ తప్పనిసరిగా ధరించాలి. తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు చిన్నపిల్లలు, మహిళలు జాగ్రత్త వహించాలి. బైక్ మీద కాకుండా ఇతర వాహనాల మీద ప్రయాణించడం మంచిది. వాహనాలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాలు కానీ మనుషులు కానీ జంతువులు గాని ఏమీ కనిపించవు.

ముఖ్యంగా సైకిల్ మీద వెళ్లే వారు నడుచుకుంటూ వెళ్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోటార్ సైకిల్ మీద వెళ్లే వారు ఆటోలో వెళ్లే వారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి వాహనాలకు లైటింగ్ తక్కువగా ఉంటుంది. మరియు గ్రామాల గుండా మరియు చిన్న చిన్న రోడ్ లోకి వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరియు పొలాల గుండా కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అక్కడ ఎక్కువ మంచుతో కప్పబడి ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పొగమంచు కారణంగా వారు ఫాగ్ మరియు డ్రిప్లైట్ కచ్చితంగా వాడాల్సి ఉంటుంది. దీనివల్ల పొగమంచులో కూడా వాహనాలను గుర్తించవచ్చు. పొగ ఎక్కువ ఉంటే మనకి 20 నుంచి 30 మీటర్స్ దూరం తర్వాత కనిపించదు. కావున మనము వాహనాలకు 20 నుంచి 30 మీటర్ల దూరంలో వెళుతూ ఉండాలని... దూరాన్ని పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు