హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ananthapur: ఈ ఊరు సైన్యానికి పుట్లిళ్లు..!

Ananthapur: ఈ ఊరు సైన్యానికి పుట్లిళ్లు..!

సైన్యానికి పుట్టినిల్లు

సైన్యానికి పుట్టినిల్లు

Andhra Pradesh: శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుగొండ మండలం వద్ద గల ఒక గ్రామంలో జనాభా తక్కువ ఉంటుంది.కానీ వారిలో దేశభక్తి ఎక్కువ. దీనితో క్రమంగా యువత ఆర్మీలో జాయిన్ అవుతూ వస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(G.Venkatesh, News 18, Ananthapur)

శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుగొండ మండలం వద్ద గల ఒక గ్రామంలో జనాభా తక్కువ ఉంటుంది.కానీ వారిలో దేశభక్తి ఎక్కువ. దీనితో క్రమంగా యువత ఆర్మీలో జాయిన్ అవుతూ వస్తున్నారు. చూడడానికి అదొక మారుమూల గ్రామం..నివసించే జనాభా 2000 మాత్రమే.ఇందులో పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ కలిసిన 2000 లోపే జనాభా ఉంటుంది. కానీ ఈ గ్రామం నుంచి ఆర్మీలోకి వెళ్లే వారి సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఈ గ్రామం పేరు పెనుగొండ మండలంలోని శెట్టిపల్లి గ్రామం.

ఇంతకుముందు గ్రామాల నుంచి ఎవరైనా ఆర్మీలోకి వెళ్లాలంటే ఇంట్లోవాళ్లు, వారి బంధువులు ఎందుకు వెళ్తావు అని అడ్డు చెప్పేవారు. అక్కడికి వెళితే కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని,ప్రాణాలు తెగించి పోరాడాల్సి వస్తుందని వారు ఎవరిని ఆర్మీలోకి వెళ్ళనిచ్చేవారు కాదు. ఎంత ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అక్కడే గ్రామంలో ఏదో ఒక వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించమని చెప్పేవారు.

అలాంటి ఆలోచనలు ఉన్న ఈ గ్రామంలో దాదాపుగా 50 మంది వరకు ఆర్మీలో పనిచేస్తున్నారు. మొదటగా ఈ ఊరు నుంచి 1974 వ సంవత్సరంలో రామాంజనేయులు, సోమశేఖర్ మరియు 1975 వ సంవత్సరంలో ఆంజనేయులు, దూదేకుల బాబు ఆర్మీలో చేరారు. అయితే వీరు దేశ రక్షణలో పాల్గొని తిరిగి సొంత గ్రామానికి వచ్చినప్పుడల్లా ఆ గ్రామంలో ఉన్న యువతకి దేశ రక్షణ మరియు ఆర్మీ గొప్పతనాన్ని తెలియజేస్తూ, వారిలో దేశంపై ప్రేమను పెంచారు.

వారు చేసిన ఇన్స్పిరేషన్ ఈ రోజు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, పారా మిలిటరీ వంటి వివిధ విభాగాలలో ఎంతోమంది యువత పనిచేస్తున్నారు. ఇలా ఒక్కరితో ఇద్దరితో మొదలైన ప్రయాణం ఈ రోజు ఎంతో మంది యువత అక్కడికి వెళ్లి దేశ రక్షణలో పాలుపంచుకోవడం నిజంగా వారి గొప్పతనమే.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు