ఎంతో ఆసక్తికరంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా ఉత్కంఠంగా జరిగింది. అన్ని స్థానాల కన్నా ఈ స్థానం మొదటి నుంచి దోబూచులాడుతూ వస్తూఉంది. రౌండ్ రౌండ్ కి ఉత్కంఠ భరితంగా సాగింది ఈ ఎన్నిక. వైఎస్ఆర్సిపి తరఫున వెన్నపూసరవీంద్ర రెడ్డి మరియు టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఈ ఎన్నికలలో పోటీపడ్డారు. అయితే మొదటి ప్రాధాన్యత లో ఎవరికి ఆధిక్యం రాకపోయేసరికి రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించారు.
అయితే ఈ లెక్కింపులో టిడిపి అభ్యర్థికి మెజార్టీ లభించింది. దీనితో రాష్ట్రంలోనే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. కానీ అనంతపురం నగరంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద హైడ్రామా నడిచింది. కౌంటింగ్ నిర్వహించే సమయంలో ఎంతో ఉత్కంఠంగా జరిగిన కౌంటింగ్ శనివారం సాయంత్రం టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు.
అనంతపురంలో జేఎన్టీయూలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టిడిపి తరఫున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7543 మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఎన్నికల అధికారికి పట్టభద్ర ఎమ్మెల్సీగా గెలిచామని అధికార ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని టిడిపి నేతలు కోరారు. ల రిఅయినా ఎన్నికటర్నింగ్ కారిఅధి. నాగలక్ష్మి ధ్రువీకరణ పత్రాన్ని అందజేయకుండా వెళ్లిపోయారు.
దీంతో అర్ధరాత్రి టిడిపి నాయకులు కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ధ్రువ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి వారందరినీ సమీప పోలీస్ స్టేషన్ తరలించారు అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సహరించకపోవడంతో అతనిని లారీలో స్టేషన్ కి తరలించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు వెంటనే అధికారి ధృవీకరణ పత్రం అందించెేల చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
వీరితో పాటు మరికొంతమంది.. మాజీ మంత్రి పరిటాల సునీత, పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, పార్థసారిథి, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డిని అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News, Mlc elections