హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వేమన పద్యాలు చదివిన మంత్రి రోజా.. వాళ్లిద్దరే టార్గెట్.

వేమన పద్యాలు చదివిన మంత్రి రోజా.. వాళ్లిద్దరే టార్గెట్.

X
వేమన

వేమన జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా

ఏపీ మంత్రి రోజా (AP Minister Roja) మరోసారి పంచ్ లు పేల్చారు. సత్యసాయి జిల్లా కటారుపల్లిలో జరిగిన వేమన జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమన పద్యాలు చదువుతూ ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kadiri | Anantapur | Andhra Pradesh

ఏపీ మంత్రి రోజా (AP Minister Roja) మరోసారి పంచ్ లు పేల్చారు. సత్యసాయి జిల్లా కటారుపల్లిలో జరిగిన వేమన జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమన పద్యాలు చదువుతూ ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడిపై కొందరు భౌ..భౌ.. అని అరుస్తున్నారని.., వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొసొందన్న ఆమె..,సజ్జనుండు పలుకు చల్లగాను.. కంచు మోగినట్లు కనకంబు మోగునా... అని వేమన గారు పద్యం రాశారని.., మన రాష్ట్రంలో సజ్జనుడు అయిన నాయకుడు సీఎం జగన్ మాత్రమేనన్నారు. అల్పులు మాత్రం చాలా మంది ఉన్నారని., వారంతా.. గుంపులుగుంపులుగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెంతమంది కలిసొచ్చినా... సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు. కంచులెన్ని మోగినా.. అన్నట్టు వారంతా వీకెండ్‌ పొలిటీషియన్స్ మాత్రమే... అంటూ మంత్రి రోజా విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు రోజా. 350 సంవత్సరాలైనా ఇప్పటికీ వేమన పద్యాలను నేటి పరిస్థితులకు అనుగుణంగా బేరీజు వేసుకుంటున్నామంటే వేమన గారి ఘనత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందన్నారు. ఆయన ఎంతో గొప్ప ప్రజాకవి, సామాజిక విప్లవకవి, ఆయనలో ఒక తాత్వికుడు ఉన్నారని ఆయన పద్యాలు నిరూపిస్తాయిని.., పండితులతో పాటు పామరులు కూడా మెచ్చిన పద్యాలను వేమన రాశారన్నారు.

ఇది చదవండి: నాటుకోడి తెలుసు.. మ‌రి కోస మాంసం రుచి ఏలా ఉంటుందో తెలుసా..!

వేమన పుట్టిన గడ్డపై పుట్టడం అదృష్టం

వేమన పుట్టిన తెలుగు గడ్డపై మనమూ పుట్టడం మన అదృష్టంగా భావించాలి. ఇప్పటికీ ఆయన సమాధికి పూజలు చేస్తున్నారన్నారు మంత్రి రోజా . 17వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు ఆయన పద్యాలను నెమరేసుకుంటున్నారంటే ఇంతకన్నా వేమన గురించి చెప్పాల్సిన పనిలేదు. పేరు ప్రఖ్యాతుల కోసం చాలా మంది కవితలు రాస్తారని.., కానీ వేమన ప్రజా చైతన్యానికి ప్రాధాన్యమిచ్చి పద్యాలు రాశారని చెప్పారు. ఒక చిన్నపద్యంలో ఎంతో భావాన్ని గుదిగుచ్చడం వేమన ప్రత్యేకతన్నారు.

First published:

Tags: Anantapuram, Local News, Minister Roja

ఉత్తమ కథలు