హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

God Father Pre-Release: అనంతపురంలో మెగా కోలాహలం.. ఉదయం నుంచే సందడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

God Father Pre-Release: అనంతపురంలో మెగా కోలాహలం.. ఉదయం నుంచే సందడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల (Twitter/Photo)

గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల (Twitter/Photo)

God Father Pre-Release Event: అనంతపురంలో మెగా సంబరాలు మిన్నంటుతున్నాయి.. అభిమానం అంటే ఇది అని చూపిస్తున్నారు.. ఉదయం నుంచి కిలోమీటర్ల మేర ఈవెంటన్ చూసేందుకు అభిమానులు క్యూ లైన్లో నిల్చున్నారు.. తమ అభిమాన హీరోను చూసేందుకు ఎదురు చూస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  God Father Pre-Release Event:  మెగా అభిమానులు (Mega Fans) ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న.. పండగ రానే వచ్చింది. మరొక వారం రోజుల్లో దసరా (Dussehra) కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాపై అందరి అటెన్షన్ నెలకొనింది. అయితే ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే ఈ సినిమా విషయంలో అంతా కూడా ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతందనే అంచనాలో ఉన్నారు మెగా అభిమానులు. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు కాస్త గ్యాప్ ఉండడంతో ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది మెగా యూనిట్.. దీనిలో భాగంగా ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుఘనంగా నిర్వహించనున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం (Anantapurm ) లో ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.

  టాలీవుడ్ లో ఎందరు స్టార్ హీరోలు ఉన్నా.. మెగా హీరోలకు ప్రత్యేక స్థానం అని చెప్పక్కర్లేదు. ఆ హంగామా అంతా అనంతపురంలో కనిపిస్తోంది. ప్రిరిలీజ్ ఈ వెంట్ కోసం భారీగా అభిమానులు తరలి వచ్చారు. అందులో అందుకు తమ అభిమాన హీరో చిరంజీవిన దగ్గరుండి చూడాచ్చని ఆరాటపడుతున్నారు. దీంతో ఉదయం నుంచే అనంతపురంలో సంబరాలు మిన్నంటాయి. అక్కడి అభిమానుల కోలాహం చూస్తే.. అభిమానం అంటే ఇలా ఉంటుందా అని షాక్ అవ్వాల్సిందే..?

  #Godfather ||అనంతపురంలో మెగా సంబరాలు||అభిమానం అంటే ఇదే|| గాడ్ ఫాదర్ ప్రీ... https://t.co/wbRI4dvHcE via @YouTube #GodFatherOnOct5th #GodFatherPreReleaseEvent #godfatherinanantapur #GodFatherOnOctober5th #godfatherofkfi #godfatherfirstsingle #Megablockbuster

  ఈ మెగా ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా కొత్త ఎలిమెంట్స్ తో చేయనున్నారని తెలుస్తోంది. అలాగే గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ వస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర నటీనటులు మాత్రమే హాజరు కానున్నట్టు సమాచారం

  ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. గాడ్ ఫాదర్‌గా చిరంజీవి నటన అద్భుతం అంటూ సెన్సార్ వాళ్ల ఇన్‌సైడ్ టాక్. ఇక చిరు కూడా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. హీరోయిన్ కేవలం ఒకే పాట ‘తార్ మార్ తక్కర్ మార్’ ఈ సినిమాలో ఉన్నట్టు సమాచారం.

  ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. కార్యాలయాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి నిరాకరణ.. అత్యవసరం అయితే?

  తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. థమన్ సంగీతం అందించాడు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, God father, God Father Movie, Megastar Chiranjeevi

  ఉత్తమ కథలు