హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కూతురి ఫ్రెండ్ అంటే కూతురిలా చూడాలి.. కానీ ఇలా చేస్తారా..?

కూతురి ఫ్రెండ్ అంటే కూతురిలా చూడాలి.. కానీ ఇలా చేస్తారా..?

అనంతపురం జిల్లాలో బాలికపై అత్యాచారం

అనంతపురం జిల్లాలో బాలికపై అత్యాచారం

ఈ రోజుల్లో బాలికల పట్ల నేరాలు పెరిగిపోతున్నాయి. కొందరు పశువుల్లా మారి చిన్నారుల్ని చిదిమేస్తున్నారు. కూతురి స్నేహితురాలిని కూతురిలా చూడాల్సిన వాడు ఆమెను వక్ర బుద్ధితో చూశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

ఈ రోజుల్లో బాలికల పట్ల నేరాలు పెరిగిపోతున్నాయి. కొందరు పశువుల్లా మారి చిన్నారుల్ని చిదిమేస్తున్నారు. కూతురి స్నేహితురాలిని కూతురిలా చూడాల్సిన వాడు ఆమెను వక్ర బుద్ధితో చూశాడు. అంతేకాదు కాటువేసేందుకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్య సాయి జిల్లా (Sri Satyasai District) చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో పాఠశాలలో చదివే విద్యార్థినిపై ఆమె స్నేహితురాలి తండ్రి అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలమత్తూరులో గ్రామంలో నివసించే శ్రీనివాసులు ఇంటి ముందు ఓ చిన్నారి తన స్నేహితురాలితో ఆడుకుంటోంది. అలా ఆడుకొంటుండగా భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాస్ ఆ చిన్నారితో చిన్నగా మాటలు కలిపాడు.. మీ అమ్మ సమీప గ్రామ సచివాలయంలో ఉంది. నువ్వు సంతకం పెట్టాలని తీసుకొని రమ్మందని చెప్పి, ఎవరికీ అనుమానం రాకుండా మరో ఇద్దరు విద్యార్థినులను తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని వెళ్లాడు.

గ్రామం దాటగానే మిగిలిన వారిని దించేసి బాలికను తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రదేశం చూసి చిన్నారిపై శ్రీనివాసులు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత బాలికను ఇంటి వద్ద వదలి వెళ్లిపోయాడు. శరీరంపై గీతలు పడి ఉండటం, రక్తస్రావం కావడంతో బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసినట్లు బాలిక వెల్లడించింది.

దీంతో స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి చిలమత్తూరు పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు దొంగతనాలు, ఇతరత్రా కేసులు ఉన్నాయి. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు