హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అత్యాశే వాళ్లను ముంచింది.. ఎలా బురిడీ కొట్టించాడో చూడండి..!

అత్యాశే వాళ్లను ముంచింది.. ఎలా బురిడీ కొట్టించాడో చూడండి..!

సత్యసాయి జిల్లాలో మోసం

సత్యసాయి జిల్లాలో మోసం

Anantapuram: డబ్బంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. ఆ ఆశే వారిని మోసపోయేలా చేస్తోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ఆశలను పెట్టుబడిగా చేసుకొని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకొని బిచాణా ఎత్తేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

డబ్బంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. ఆ ఆశే వారిని మోసపోయేలా చేస్తోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ఆశలను పెట్టుబడిగా చేసుకొని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకొని బిచాణా ఎత్తేస్తున్నారు. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా (Sri Satyasai District) పెనుగొండ నియోజకవర్గంలో గల సోమందేపల్లి మండలంలో ప్రజలను మోసగించి డబ్బుతో పరారయ్యాడు ఓ కేటుగాడు. అత్యాశకు పోయిన ప్రజలు మోసపోయారు. లక్షల్లో పెట్టుబడి పెట్టండి.. ప్రతిరోజు వేల రూపాయలలో కమిషన్ తీసుకోండి అని చెప్పిన ఈ మాయగాడు.. అందరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యాడు. అయితే అందరి వద్ద నుంచి డబ్బు వసూలు చేసి వారికి కొద్ది రోజులపాటు సక్రమంగానే ప్రతిరోజు కమిషన్ ఇచ్చేవాడు,.

అయితే ఇది నిజమని ప్రజలు నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. అతను డబ్బుతో పరారవడంతో తాము మోసపోయామని గమనించిన బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మోసపోయిన వారు తెలిపిన వివరాల మేరకు ఐటిసి సిగరెట్ మరియు చక్కెర హోల్ సేల్ వ్యాపారం చేస్తానని గత నెలలో మనోహర్ రెడ్డి అలియాస్ చక్కెర రెడ్డి, సోమందేపల్లికి వచ్చాడు.

ఇది చదవండి: భర్త దూరమయ్యాడని.. మరొకరికి దగ్గరైంది. కానీ ఆ బంధమే..

తనది గోరంట్ల మండలం అని అందరికీ చెప్పాడని తెలిపారు.అతనితోపాటు నాగేంద్ర రెడ్డి (కొత్తచెరువు), శివ (ఎం ఎస్ గేట్), భాష (ముదిగుబ్బ), అనేవారు కూడా ఉన్నారని, వాళ్లలో ఒకరు కార్ డ్రైవర్ గా, ఒకరు ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నామని తప్పుడు సమాచారంతో తమను నమ్మించారని తెలిపారు.మనోహర్ రెడ్డి తనకు ఐ టి సి కంపెనీ నుంచి ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ ఉందని మరియు చక్కర వ్యాపారం హోల్సేల్గా చేస్తానని నమ్మించాడు.

ఇది చదవండి: చెరువు గ‌ట్టున ఏం జ‌రిగింది.. అత‌డు ఎందుకు శ‌వ‌మైయ్యాడు..!

2.72 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే రోజుకి 3 వేల రూపాయలు కమిషన్ ఇస్తానని ఆశ చూపాడని బాధితులు తెలిపారు.ఈ సమయంలో కొద్ది రోజులు సక్రమంగానే కమిషన్ చెల్లించారు. దీనితో చాలామంది పెట్టుబడులు పెట్టారు.వారి బంధువుల దగ్గర నుంచి కూడా పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు.

ఈ తరుణంలో 2.50 కోట్ల పైనే మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు.. మంగళవారం నుంచి షాపు ఓపెన్ చేయకపోవడంతో ఫోన్ చేశామని...అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందిని... తమనిమోసం చేశారని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి... ఫిర్యాదు చేశారు.తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు