హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lady Doctor: డాక్టర్ అయిఉండి ఓ రోమియో వలలో పడింది.. పెళ్లైంది వద్దన్నా వినలేదు.. చివరకు ఎంతఘోరం..?

Lady Doctor: డాక్టర్ అయిఉండి ఓ రోమియో వలలో పడింది.. పెళ్లైంది వద్దన్నా వినలేదు.. చివరకు ఎంతఘోరం..?

నిందితుడు మహేష్

నిందితుడు మహేష్

Hindupur: ప్రేమ పేరుతో మాయలు చేస్తున్నారు కొందరు మాయగాళ్లు. మైనర్ బాలికల నుంచి.... పెళ్ళైన వివాహితల వరకు వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కొందరు రోమియోలు వివాహితల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hindupur, India

  GT Hemanth Kumar, News18, Tirupati


  ప్రేమ (love) పేరుతో మాయలు చేస్తున్నారు కొందరు మాయగాళ్లు. మైనర్ బాలికల నుంచి.. పెళ్ళైన వివాహితల వరకు వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కొందరు రోమియోలు వివాహితల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదుకున్న మహిళలు సైతం మాయగాళ్ల ట్రాప్‌లో పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలాగే ఓ నరరూప రాక్షసుని చెరలోకి చిక్కిందో వివాహిత. పది మంది ప్రాణాలు కాపాడే డాక్టర్ వృత్తిలో కొలువు చేస్తుంది. నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి.. బెంగళూరుకు వెళ్లే ప్రయాణమే ఆమెకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పినా ఆ కామోన్మాది వినలేదు. పచ్చ బొట్టు వేసుకున్నా.. నన్ను ప్రేమించాలని హుకుం జారీ చేసాడు. వినకపోతే అతను చేసిన అకృత్యాలు చెప్పలేవిని. చివరకు అనంతపురంలో ఓ లాడ్జ్ కి రమ్మని ఎంతపని చేసాడో తెలుసా..?


  వివరాల్లోకి వెళితే.. తెలంగాణ (Telangana) రాష్ట్రం వరంగల్‌ జిల్లా (Waranal) మంగపేటకు చెందిన దేంతనపల్ల డాక్టర్‌ అక్షిత చిక్కబళ్లాపూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. మంగపేట నుంచి ఆసుపత్రికి నిత్యం బస్సులో ప్రయాణం సాగించేది. అదే సమయంలో ఏటూరు నాగరం పట్టణానికి చెందిన పిసింగి మహేశ్‌ వర్మ 6 నెలల క్రితం డాక్టర్ అక్షిత ప్రయాణించే బస్సులోనే నిత్యం ప్రయాణించేవాడు. ఇలా మహేష్ డాక్టర్ అక్షితతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. అక్షిత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. అప్పటి నుంచి అక్షితకు వర్మ ఆమెకు వీడియో కాల్స్‌ చేసేవాడు. అలా నిత్య కృత్యంగా డాక్టర్ అక్షితను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడు.


  ఇది చదవండి: వైజాగ్ సాయి ప్రియాంక గుర్తుందా..? ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే..!


  ఇక ఉన్న విద్య అభ్యసించాలని అక్షిత భావించింది. తన ఉన్నత విద్య కోసం కొన్నిరోజుల క్రితం అక్షిత చిక్‌బళ్లాపురం వెళ్లి అక్కడే ఉంటోంది. వర్మ అక్షితను అక్కడ కూడా వదలలేదు. అక్కడికే వెళ్లి వేధింపులు మొదలుపెట్టాడు. అక్షిత తనకు పెళ్లి అయ్యి చిన్నపాప ఉందని తిరస్కరించినా వినలేదు. ఒంటిపై ఆమె పేరు, ఫొటోలతో పచ్చబొట్లు వేసుకోవడమే కాకుండా ప్రేమ ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినా అక్షిత ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన మహేష్‌ వర్మ వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మళ్లీ ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని ఈ నెల 24న హిందూపురంలోని జీఆర్‌ లాడ్జీకి రప్పించి అత్యాచారం చేశాడు.



  ఫొటోలు డిలీట్‌ చేయాలని కోరితే.. ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం లాడ్జీ నిర్వాహకుల వద్ద ఆమెకేమైందో తెలియదని అమాయకుడిలా నటిస్తూ తనే 108కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మహేష్‌వర్మపై గతంలో కూడా ఆ రాష్ట్రంలో వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh

  ఉత్తమ కథలు