G Venkatesh, News18, Anantapuram
లేపాక్షి (Lepakshi). ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని హస్తకళలను ప్రోత్సహించి వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. ఇక్కడ మన రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రముఖ హస్త కళలకు సంబంధించిన వస్తువులు లభిస్తాయి. ఇక లేపాక్షి అంటే రాయలసీమ వాసుల మనసుకు మరింత దగ్గరైంది. లేపాక్షి క్షేత్రం చారిత్రక వైభవానికి ప్రతీక. అనంతపురంలో ఏర్పాటు చేసిన లేపాక్షి ఎంపోరియం.. హస్తకళలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఇక్కడ కొండపల్లి పల్లి, ఏటికొప్పాక కొయ్యబొమ్మలతో పాటు సాంప్రదాయ నేత వస్త్రాలు కూడా లభిస్తాయి. రాగి, ఇత్తడితో తయారు చేసిన కళాఖండాలు లపాక్షిలోనే దొరుకుతాయి. ఇక రోజు వుడ్, నీమ్ వుడ్, టేక్ వుడ్, శాండిల్ వుడ్ తో తయారు చేసిన వివిధ రకాల చెక్క విగ్రహాలు మరియు బొమ్మలను మనకు ఇక్కడ లభిస్తాయి.
శాండిల్ తో తయారు చేసిన శాండిల్ పౌడర్, అగరబత్తి మరియు గంధపు విగ్రహాలు అనేక రకాల కళాకృతులలో మనకు లభిస్తాయి. నీమ్ వుడ్ తో తయారుచేసిన అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఇక్కడ మనకు ఉంచారు. మంచి విలువ కలిగిన మార్బుల్ రాయితో చేసిన విగ్రహాలు కూడా ఇక్కడ మనకు లభిస్తాయి. కాంస్యంతో తయారు చేసిన నటరాజ విగ్రహాలు, శ్రీకృష్ణ విగ్రహాలు, గణేశుని విగ్రహాలు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చారిత్రాత్మక కళలు ఉట్టిపడేలా ఇక్కడ విగ్రహాలను అమ్మకానికి ఉంచారు.
ఇక ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే నిర్ణయించింది. ఇంటిని అందంగా అలంకరించుకోవాలన్నా.. ఎవరికైనా బహమతులివ్వాలన్నా లేపాక్షిలో లభించే కళాఖండాలు పర్ఫెక్ట్ ఛాయిస్. అంతేకాదు శాలువాలు, అందమైన చేనేత చీరలు మరెక్కడా లేని విధంగా లేపాక్షిలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News